Hyundai
Hyundai : దేశంలోని ఆటోమైబైల్ ఇండస్ట్రీలో హ్యుందాయ్ పేరు అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా ఈ బ్రాండ్ నుంచి వస్తున్న కార్లు కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. దేశీయ కారు అమ్మకాల్లో హ్యుందాయ్ సంస్థ రెండో స్థానంలో కొనసాగుతోంది. కంపెనీ అందించే అట్రాక్టివ్ డిజైన్స్, ఫీచర్లతో ఈ సంస్థ నుంచి వస్తున్న కార్లు భారతీయ వినియోగదారులను బాగా ఆకర్షి్స్తున్నాయి. అయితే ఇటీవల ఈ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తు్న్న క్రెటా, అల్కాజర్ టుక్సాన్ ఆరా మోడల్స్ ధరలను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తాజాగా మరో పాపులర్ సెడాక్ కారు వెర్నా ధరను కూడా పెంచి షాక్ ఇచ్చింది. హ్యుందాయ్ వెర్నా సెడాన్ కార్ ధర రూ.7వేల మేర పెరిగింది. దీంతో ఈ కారు లేటెస్ట్ ధర రూ.11.07 లక్షల నుంచి రూ. 17.55 లక్షలకు (ఎక్స్-షోరూం) చేరుకుంది. ఈ కారు EX, S, X (O), SX (O) పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ వెర్నా
ఇండియాలో సేఫెస్ట్ కారుగా వెర్నా పేర్గాంచింది. మిడిల్ క్లాస్ పీపుల్ బడ్జెట్ లోనే ఈ కారు లభిస్తుంది.. క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ వెర్నా కారు ఎక్సటర్నల్ అట్రాక్టివ్ డిజైన్‌తో ఉంటుంది. ఇది Atlas white, Abyss black, Starry night,Amazon grey, Titan grey, Typhoon silver Fiery red పలు కలర్ ఆఫ్షన్లలో వస్తుంది. ఈ కారులో ఫ్రీగా ఐదుగురు ప్రయాణించవచ్చు. కారులో 528 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ హ్యుందాయ్ కారు రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో చార్జ్‌డ్ ఇంజిన్.. 160పీఎస్ పవర్, 253ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT(డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్) గేర్‌బాక్స్‌తో వస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
అలాగే హ్యుందాయ్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడు పోయే కారు అయిన గ్రాండ్ ఐ10 నియోస్ ధరను కూడా కంపెనీ భారీగా పెంచింది. ఈ కారు కొనుగోలు చేయాలంటే రూ. 15,200 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ ఐదు వేర్వేరు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. స్పోర్ట్జ్ (O) వేరియంట్ మినహా, మిగతా అన్ని వేరియంట్‌ల ధర రూ. 15,200 వరకు పెరిగింది. ధరల పెరుగుదల తర్వాత ఈ కారు కొత్త ధర రూ. 5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 8.62 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు చేరింది. సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారును పెట్రోల్, సీఎన్జీ ఆఫ్షన్లలో పొందవచ్చు.