Hyundai : హ్యుందాయ్ ఇండియా మే నెలలో తన కార్లు, SUVలను కొనుగోలు చేసే వారికి రూ.4 లక్షల వరకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో ఇటీవల విడుదల చేసిన 2025 మోడల్స్‌తో పాటు 2024 మోడల్స్ కూడా ఉన్నాయి. కొన్ని డీలర్ల వద్ద ఇంకా అమ్ముడుపోకుండా ఉన్న మోడల్స్‌పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.
కంపెనీ చౌకైన కారు గ్రాండ్ i10 నియోస్ విషయానికి వస్తే.. దీని CNG వేరియంట్‌పై రూ.80,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఎంట్రీ-లెవెల్ ఎరా వేరియంట్‌ను మినహాయించి పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌పై రూ.75,000 వరకు తగ్గింపు ఉంది. పెట్రోల్ AMT వేరియంట్‌పై రూ.60,000 వరకు తగ్గింపు లభిస్తోంది. బేస్ మోడల్‌పై రూ.45,000 తగ్గింపు ఉంది. ఇక ఆరా సెడాన్ విషయానికి వస్తే, CNGపై అత్యధికంగా రూ.65,000 తగ్గింపు లభిస్తోంది. అయితే, ఎంట్రీ-లెవెల్ E మోడల్‌పై కేవలం రూ.25,000 ఆఫర్ మాత్రమే ఉంది. పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లపై రూ.50,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
Also Raed : వచ్చి పదేళ్లు అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. టాటా, మారుతి కూడా దీని వెనుకే
హ్యుందాయ్ ఎక్స్‌టర్: పెట్రోల్, CNG రెండింటిలోనూ హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేస్ ట్రిమ్‌లైన EX, EX (O)పై కూడా కేవలం రూ.5,000 తక్కువ తగ్గింపు మాత్రమే లభిస్తోంది. మరోవైపు మిగిలిన పెట్రోల్, CNG వేరియంట్‌లపై రూ.55,000, రూ. 60,000 డిస్కౌంట్ లభిస్తోంది.
హ్యుందాయ్ అల్కాజార్: ఇంకా కొంతమంది డీలర్ల వద్ద స్టాక్‌లో ఉన్న అల్కాజార్ SUV ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌పై రూ. 65,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే, తాజా మోడల్‌పై దాదాపు రూ.50,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
హ్యుందాయ్ వెన్యూ SUV: 1.2L ఇంజన్, మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన వెన్యూ SUV టాప్ మోడల్‌ను రూ.75,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. SUV 1.0L టర్బో, N లైన్ వేరియంట్‌లతో కూడా ఇదే పరిస్థితి. అయితే, S+, S(O)+, S(O)+ AE వేరియంట్‌లు రూ.65,000 వరకు తక్కువ ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. 2024మోడల్ అయోనిక్ 5 ఈవీ మీద అత్యధికంగా రూ.4 లక్షల తగ్గింపు లభిస్తోంది. కంపెనీ అక్టోబర్ 2025 నాటికి ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను భారతీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నందున ఈ భారీ తగ్గింపు అందిస్తోంది.
Also Read : ఫ్రాంక్స్, పంచ్‌లను కూడా దాటి హ్యుందాయ్ క్రెటా రికార్డ్ !