Hyundai Creta Update: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు అవుతున్న కార్లలో Hyundai కంపెనీకి చెందినవి కూడా ఉన్నాయి. దీని నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చినా చాలా కార్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వీటిలో SUV వేరియంట్ లో వచ్చిన Creta ఎక్కువగా ఆదరణ పొందింది. అయితే వినియోగదారుల అవసరాలు, అభిరుచులు మారుతున్న సమయంలో ఈ కారును అప్డేట్ చేశారు. డిజైన్తో పాటు ఇంజన్ పనితీరును మెరుగుపరిచారు. అప్డేట్ అయినా కారును ఇటీవల పరీక్షించారు. దక్షిణ కొరియా నుంచి మార్కెట్లోకి రాబోతున్న ఈ మిడ్ సైజ్ SUV సాధారణ పేస్ లిఫ్ట్ కంటే ఎక్కువ అని కంపెనీ ప్రతిరోజు తెలుపుతున్నారు. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?
కొత్తగా మార్కెట్లోకి వచ్చే హుందాయి క్రెటా కారు డిజైన్ వెరీ స్పెషల్ అనుకోవచ్చు. ఎందుకంటే దీని ఎక్స్టీరియల్ డిజైన్ లో భాగంగా బాక్సియర్, సిలౌట్ నువ్వు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గుండ్రని సర్ఫేసింగ్ నుంచి చతురస్రాకారంగా మార్చారు. దీంతో గతంలో ఉన్న క్రెటా కంటే ఇప్పుడు పరిమాణంలో కూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ కార్ కు అల్లాయి వీల్స్ 18 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. ఇవి కొత్త తరం కియా సెల్టోస్ కారుతో పోటీ పడతాయి. అలాగే రూఫ్ లైన్, స్పైలర్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తంగా ప్రీమియం లుక్ ను అందిస్తుంది.
ఈ కొత్త కారులో ఇంజన్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో కొత్తగా SX3 అనే కోడు తో ఇంజన్ ను అమర్చారు. ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజన్ కూడా ఉండనుంది. ఈ ఇంజన్లు మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేస్తాయి. మొత్తంగా ఇది హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఇంజన్ కియా సేల్టోస్ కారుకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే 2027 నాటికి సెల్టోస్ ఇదే రకమైన ఇంజన్తో మార్కెట్లోకి రాబోతుంది.
కొత్త క్రెటా టెక్నాలజీ విషయంలో కూడా మెరుగైన మార్పులు చేసుకుంది. బిగ్ స్క్రీన్ తో ఉండే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, అప్గ్రేడ్ చేసిన కార్ ఫీచర్లు, డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం తో పాటు క్యాబిన్ లేఅవుట్ ను కూడా పూర్తిగా మార్చేశారు. అలాగే సేఫ్టీ విషయంలో ADAS టెక్నాలజీని కలిగి ఉండడంతో డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. రాబోయే కాలంలో మిడ్ సైజ్ SUV కోరుకోవాలని అనుకునేవారు హుందాయి కొత్త క్రెటాను పొందేందుకు పోటీ పడతారని అంటున్నారు. ప్రస్తుతం హైబ్రిడ్ ఇంజన్ విభాగంలో టాటా సియర్రా, టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి కార్లు పోటీ పడుతున్నాయి.