Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ మోడల్ జనవరి తర్వాత మార్చి 2025లో కూడా అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ క్రెటా మొత్తం 18,059 యూనిట్లు విక్రయించింది. దీనితో మార్చి 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా నిలిచింది. గత నెలలో క్రెటా అమ్మకాలలో మారుతి స్విఫ్ట్, టాటా పంచ్, మారుతి వాగన్ఆర్ మరియు టాటా పంచ్ వంటి కార్లను అధిగమించింది. క్రెటా ఎక్స్-షోరూమ్ ధర సుమారు 11.11 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.
Also Read : ఎలక్ట్రిక్ కారు సునామీ.. 6 నెలల్లో 20వేల కార్ల విక్రయం
ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు
అప్‌డేట్ చేసిన హ్యుందాయ్ క్రెటా డిజైన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కారుకి ఫ్రంట్ గ్రిల్, డ్యూయల్-టోన్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తాయి. కాంట్రాస్ట్, టెక్స్‌చర్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కేబిన్‌లో డ్యూయల్-స్క్రీన్ సిస్టమ్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ ఫంక్షన్, బోస్ ఎనిమిది-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి.
లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్
హ్యుందాయ్ క్రెటాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకిం, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కలిగిన లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఉంది.
పవర్ ఫుల్ ఇంజిన్
క్రెటా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్ కూడా వచ్చింది. వియోగదారులకు 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి.
Also Read : ‘ఆడి’ని వెనక్కి నెట్టిన ల్యాండ్ రోవర్.. అమ్మకాల్లో రికార్డ్