Hyundai Creta Electric
Hyundai Creta Electric : హ్యుందాయ్ ఇండియా 2025 ఆటో ఎక్స్‌పోలో క్రెటా ఎలక్ట్రిక్‌ను ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ. 17 లక్షల 99 వేల ఎక్స్-షోరూమ్. ఇప్పుడు కంపెనీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కోసం బుకింగ్స్ కూడా మొదలు పెట్టింది. దీని కారణంగా వినియోగదారులు ఈ కారును కేవలం రూ.25 వేలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
బుకింగ్, వేరియంట్లు
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కోసం బుకింగ్ ప్రారంభమైంది. కస్టమర్లు కేవలం రూ. 25,000 చెల్లించి ఈ కారును ముందుగా బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ మోడల్‌లో ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ అనే నాలుగు వెరియంట్లు లభ్యమవుతున్నాయి.
క్రెటా ఎలక్ట్రిక్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది దాని పెట్రోల్-డీజిల్ ఇంజిన్ మోడల్‌ని పోలి ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లను కంపెనీ అందిస్తోంది. మొదటిది 42 kWh బ్యాటరీ ప్యాక్, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. రెండవది 51.4 kWh బ్యాటరీ ప్యాక్. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని వేరియంట్లలో ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ SUV ప్యాసింజర్ వాక్-ఇన్ పరికరం వంటి కొన్ని స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ద్వారా వెనుక సీటులో ఉన్న వ్యక్తులు ముందు సీట్లను అడ్జస్ట్ చేసుకునే వీలు ఉంది. దీనితో పాటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్‌తో కూడిన డ్యూయల్ పవర్డ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS లెవల్ 2, 360 డిగ్రీల కెమెరా, డిజిటల్ కీ అందుబాటులో ఉంటుంది.
ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది:
* ప్యాసింజర్ వాక్-ఇన్ డివైస్ – వెనుక సీట్లో కూర్చున్నవారు ముందున్న సీటును ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
* డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ – కాస్త ఎక్కువ లగ్జరీ ఫీల్.
* వెంటిలేటెడ్ పవర్డ్ సీట్స్ – డ్రైవింగ్‌కు మరింత సౌలభ్యం.
* పనోరామిక్ సన్‌రూఫ్ – మంచి వ్యూ చూసేందుకు వీలు కల్పిస్తుంది.
* ADAS లెవల్-2 సపోర్ట్ – అత్యాధునిక డ్రైవింగ్ సహాయక వ్యవస్థలు.
* 360 డిగ్రీ కెమెరా – అన్ని వైపులా క్లియర్ వ్యూ.
* డిజిటల్ కీ సపోర్ట్ – ఫోన్ ద్వారా కారును అన్‌లాక్ చేసే సదుపాయం.
క్రెటాతో పోలిస్తే హ్యుందాయ్ ఈ కారులో ముందు భాగంలో ఫ్రంక్, లోపలి భాగంలో కొత్త స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ వంటి కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ మోడల్‌లో కస్టమర్‌లు ఎనిమిది కలర్లలో కార్లను పొందుతారు, ఇందులో రెండు డ్యూయల్-టోన్ రంగులు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాప్ ఆప్షన్ అందించింది కంపెనీ. దీని ద్వారా వినియోగదారులు సులభంగా చెల్లింపు చేయవచ్చు. ఈ కారు NMC బ్యాటరీతో అమర్చబడి ఉంది. దీనికి 8 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఇది 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 171bhp ఎలక్ట్రిక్ మోటారుతో పవర్ ఇస్తుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hyundai creta electric hyundai creta at just rs 25k immediate delivery too hurry up
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com