Hyundai Creta : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మధ్య తరహా SUV విభాగంలో ఒక మోడల్ సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఇది తన విభాగంలో నిరంతరం నంబర్-1 కారుగా నిలుస్తోంది. ఈ కారు మరేదో కాదు, హ్యుందాయ్ క్రెటా. ఆర్థిక సంవత్సరం 2025లో దీని 1,94,871 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది మారుతి వాగన్ఆర్ మరియు టాటా పంచ్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. క్రెటా ఇప్పటివరకు దేశీయ, విదేశీ మార్కెట్లలో 15 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రెటా ఈ అద్భుతమైన మైలురాయిని 10 సంవత్సరాలలో సాధించింది. దీని విభాగంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టాటా కర్వ్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.
ఆర్థిక సంవత్సరం 2025లో క్రెటా 1,94,871 యూనిట్లతో దేశీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన మధ్య తరహా SUVగా నిలిచింది. గ్రాండ్ విటారా 1,23,946 యూనిట్లతో చాలా వెనుకబడి ఉండగా, సెల్టోస్ 72,618 యూనిట్లతో మరింత వెనుకబడి ఉంది. హ్యుందాయ్ జనవరిలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీనిని ‘క్రెటా ఎలక్ట్రిక్’ అని పిలుస్తారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 17,99,000 రూపాయల నుంచి 23,49,900 రూపాయల మధ్య ఉంటుంది. క్రెటా ఎలక్ట్రిక్‌లో 42kWh, 51.4kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దీని పరిధి 390 కిమీ, 473 కిమీ వరకు ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా లెవెల్-2 ADASతో 70 అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇది E, EX, S, S(O), SX, SX టెక్, SX (O) వేరియంట్‌లతో సహా 7 వేరియంట్‌లలో విడుదల చేయబడింది. క్రెటా యొక్క E వేరియంట్ ఇతర వేరియంట్‌ల వలె కనిపిస్తుంది. దీని గ్రిల్ పూర్తిగా నిండినట్లు కనిపిస్తుంది. మధ్యలో హ్యుందాయ్ లోగో ఉంటుంది. ఇందులో రివర్స్ L-ఆకారపు LED DRLలు ఉన్నాయి. అయితే, ఇవి హై-స్పెసిఫికేషన్ మోడల్ వలె కనెక్ట్ చేయబడలేదు. హెడ్‌లైట్‌లలో లో బీమ్ కోసం లోపల హాలోజన్ బల్బుతో కూడిన ప్రొజెక్టర్ యూనిట్, హై బీమ్ కోసం దాని క్రింద రిఫ్లెక్టర్ సెటప్ ఉంటుంది.
ఈ వేరియంట్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే.. ఇతర ట్రిమ్‌ల వలె డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ కూడా అదే, కానీ ఇందులో ఆడియో కంట్రోల్ లేదు. దీనికి కారణం ఆఫర్‌లో ఎటువంటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకపోవడమే. ముందు, వెనుక USB పోర్ట్‌లతో మాన్యువల్ AC అందించింది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్, కానీ ఇది i20, ఎక్స్‌టర్ నుంచి మాదిరిగా ఇచ్చారు. ఇందులో టాప్-స్పెసిఫికేషన్ మోడల్‌లో ఉన్న యూనిట్ లేదు. హ్యుందాయ్ మాన్యువల్‌గా డిమ్మబుల్ IRVMలు, మాన్యువల్ అడ్జస్టబుల్ ORVMలు, అన్ని పవర్ విండోలు, ఫ్లిప్ కీతో సెంట్రల్, రిమోట్ లాకింగ్‌ను అందించింది.
SUV లోపల ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఆర్మ్‌రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్, రియర్ AC వెంట్, ఫాబ్రిక్ సీటు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ క్రెటా E బేస్ మోడల్‌ను రెండు ఇంజన్ ఎంపికలు NA పెట్రోల్ డీజిల్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. భారతీయ మార్కెట్‌లో ఇది MG ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.