https://oktelugu.com/

Hyundai Cars:హోలీ బంఫర్ ఆఫర్.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు..

హోలీ సందర్బంగా వెన్యూపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, 10,000 ఎక్చేంజ్ బోన్ అందిస్తున్నారు. మొత్తంగా రూ.30,000 ప్రయోజనం చేకూరనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 18, 2024 / 12:02 PM IST

    Hyundai car

    Follow us on

    Hyundai Cars:దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తున్న కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. ఎస్ యూవీ కార్లను ఉత్పత్తి చేయడంలో ఈ కంపెనీ మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు దీని నుంచి రిలీజ్ అయిన మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే హ్యుందాయ్ కార్లకు డిమాండ్ ఉన్నప్పటికీ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లను ప్రకటించి ఆకట్టుకుంటుంది. తాజాగా హ్యుందయ్ హోలీ పండుగ సందర్భంగా అదరిపోయే ఆఫర్లను ఇస్తోంది. హ్యాందాయ్ నుంచి ఏ యే కార్లకు ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాం..

    హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన వెన్యూ కాంపాక్ట్ ఎస్ యూవీ. ఇది పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 1197 సీసీ ఇంజిన్ తో పనిచేసే ఇది పెట్రోల్ వేరియంట్లో 61 బీహెచ్ పీ పవర్, 113.8 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. డీజిల్ వేరియంట్ లో 84.6 బీహెచ్ పీ పవర్ 250 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. స్టైలిష్ డిజైన్ తో ఆకర్షించే ఈ కారును రూ.7.62 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే హోలీ సందర్బంగా వెన్యూపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, 10,000 ఎక్చేంజ్ బోన్ అందిస్తున్నారు. మొత్తంగా రూ.30,000 ప్రయోజనం చేకూరనుంది.

    ఇదే కంపెనీకి చెందిన ఆరా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లో 82 బీహెచ్ పీ పవర్, 114 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ మోడల్ మొత్తం 6 కలర్లలో లభిస్తుంది. దీనిని రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఈ కారు పెట్రోల్ వెర్షన్ పై రూ.5,000 తగ్గింపు ఇవ్వనున్నారు. అలాగే రూ.10,000 ఎక్చేంజ్ బోనస్, రూ.5,000 కార్పొరేట్ తగ్గింపును ప్రకటించారు. ఆరా సీఎన్ జీ పై రూ.20,000 తగ్గింపును ప్రకటించారు. అలాగే రూ.10,000 ఎక్చేంజ్ బోన్, రూ.3,000 కార్పొరేట్ తగ్గింపు వర్తిస్తుంది.

    ఈ ఆఫర్లు మార్చి 31 వరకే వర్తిస్తాయి. అంతేకాకుండా ఈ డిస్కౌంట్లు ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. అందువల్ల డిస్కౌంట్ కోరుకునేవారు సమీప ప్రాంతాల్లోని షోరూం వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఇప్పటికే క్రెటా వంటి బెస్ట్ మోడళ్లను తీసుకొచ్చింది. ఇప్పుడు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో వినియోగదారులు హ్యుందాయ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.