https://oktelugu.com/

Hyundai: హ్యుందాయ్ నుంచి సరికొత్త కారు.. సఫారీ, మహీంద్రా కార్లకు గట్టి పోటీ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

Hyundai: ప్రస్తుతం ఉన్న వినియోగదారుల కోసం అల్కాజార్ ను తయారు చేశారు. ఇందులో LEC డేటైమ్ లైట్లు ఉంటాయి. వీటితో పాటు ఆధునీకరించిన బంపర్ కు ఇతర డిజైన్ ట్విక్ లను అమర్చారు. ఇంటీరియర్ లో డ్యూయెల్ డ్యాష్ బోర్డ్ స్క్రీన్ లేఅవుట్ ఉండనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2024 / 01:50 PM IST

    Hyundai Alcazar

    Follow us on

    Hyundai: దేశీయ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చి ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే దీని నుంచి వచ్చి క్రెటా, క్రెటా ఫేస్ లిప్ట్ విజయవంతంగా రన్ అవుతోంది. ఇటీవల ఈ కారు సేల్స్ బాగా పెరిగాయి. ఒక్క జూన్ నెలలోనే క్రెటాను 10 వేలకు పైగా కొనుగోలు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే హ్యుందాయ్ నుంచి కొత్త అల్కాజార్ రావడానికి సిద్ధంగా ఉంది. అయితే దీని గురించిన సమాచారం ముందే లీక్ అయింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    ప్రస్తుతం ఉన్న వినియోగదారుల కోసం అల్కాజార్ ను తయారు చేశారు. ఇందులో LEC డేటైమ్ లైట్లు ఉంటాయి. వీటితో పాటు ఆధునీకరించిన బంపర్ కు ఇతర డిజైన్ ట్విక్ లను అమర్చారు. ఇంటీరియర్ లో డ్యూయెల్ డ్యాష్ బోర్డ్ స్క్రీన్ లేఅవుట్ ఉండనుంది. క్రెటాను పోలిన బాడీలాగా అందంగా కనిపిస్తుంది. మెరుగైన డ్రైవర్ ఫీచర్లు, లెవల్ 2 ఆడాస్ సూట్ ను అమర్చారు. లాంగ్ జర్నీ చేసే వారికి ఆటోమేటిక్ క్లైమేట్ ఇందులో ఉండనుంది.

    హ్యుందాయ్ అల్కాజార్ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్, టర్బో ఇంజిన్లు ఉండనున్నాయి. 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ అల్కాజార్ అప్డేట్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది మార్కెట్లోకి వస్తే టాటా సఫారీ, మహీంద్రా XUV700 కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఎస్ యూవీ విభాగంలో ఉన్న ఈ మోడల్ కు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. అయితే వచ్చే పండుగ సీజన్లో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సరికొత్త స్పోర్టీ డిజైన్ తో పాటు స్టాండ్ అవుట్ ఫీచర్లు కలిగిన దీని ధర రూ.16.77 లక్షల ప్రారంభంతో విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.