Hyundai Alcazar: ఆ మూడు కార్లకు మొగుడు.. త్వరలో మార్కెట్లోకి.. ఆటో రంగం షేక్?

హ్యుందాయ్ నుంచి అనేక దిగ్గజాలు మార్కెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. వీటిలో ఎక్స్ టర్ ఇటీవల రికార్డు నమోద చేసింది. ఇప్పుడు 7 సీటర్ వేరియంట్లలోనూ హ్యుందాయ్ తన సత్తా చాటాలని అనుకుంటోంది. ఇందులో బాగంగా హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్ లిప్ట్ ను రెడీ చేస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : July 24, 2024 1:10 pm

Hyundai Alcazar

Follow us on

Hyundai Alcazar: కారు కొనాలనుకునేవారు వివిధ అభిప్రాయలను కలిగి ఉంటారు. కొందరు ఇంజిన్ విషయాన్ని పరిశీలిస్తే..మరికొందరు ఫీచర్స్, ధర పై ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం 7 సీటర్ కారు కావాలని కోరుకుంటారు. కార్యాలయ అవసరాలతో పాటు ఫ్యామిలీ ట్రిప్ కోసం 7 సీటర్ కారు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా పెద్ద కార్లలో ప్రయాణించాలని కొందరికి ఆశ ఉంటుంది. దీంతో 7 సీటర్ కారు మార్కెట్లోకి ఏదీ కొత్తది వచ్చినా ఈ వర్గం వారు కొనేందుకు రెడీగా ఉంటారు. ఇప్పటి వరకు మార్కెట్లోకి 7 సీటర్లలో బెస్ట్ కారు ఏదంటే మహీంద్రా XUV700, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ లు బాగా ప్రాచుర్యం పొందాయి. అత్యధికంగా 7 సీటర్ లవర్స్ ఈ మూడు కార్లలో ఏదో ఒకటి కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి కొత్త కారు రాబోతుంది. హ్యుందాయ్ కంపెనీ కొత్తగా ఓ మోడల్ ను తీసుకొస్తుంది. అదే అల్కాజార్ ఫేస్ లిప్ట్. హ్యుందాయ్ నుంచి అల్కాజార్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇప్పడు దీనిని ఆధునీకరించి ఫేస్ లిప్ట్ గా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. పాత అల్కాజార్ నుంచి కొన్ని మార్పులు చేయనున్నారు. దీంతో ఇప్పుడున్న 7 సీటర్ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ హ్యుందాయ్ కొత్త అల్కాజార్ ఎలా ఉండబోతుంది.? దాని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు తెలుసుకోవాలంటే కిందికి వెళ్లండి..

హ్యుందాయ్ నుంచి అనేక దిగ్గజాలు మార్కెట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. వీటిలో ఎక్స్ టర్ ఇటీవల రికార్డు నమోద చేసింది. ఇప్పుడు 7 సీటర్ వేరియంట్లలోనూ హ్యుందాయ్ తన సత్తా చాటాలని అనుకుంటోంది. ఇందులో బాగంగా హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్ లిప్ట్ ను రెడీ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. వీటిని చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. కొత్త అల్కాజార్ లో రెండు ఇంజిన్లు ఉండనున్నాయి. వీటిలో ఒకటి 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీతో పనిచేస్తుంది. డీజిల్ ఇంజిన్ లో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో రన్ అవుతుంది. అయితే పాత అల్కాజార్ కంట్ కొత్త మోడల్ లో పవర్ ట్రెయిన్ ను చేర్చారు.

అల్కాజార్ కొత్త మోడల్ లో కొన్ని లేటేస్ట్ పీచర్స్ ను చేర్చారు. ఇప్పటికే ఉన్న అల్కాజార్ లో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్ , 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 10.25 అంగుళాల హెచ్ డీ టచ్ స్క్రీన్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇటీవల వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్న పనోరమిక్ సన్ రూప్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్ ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్ ఫ్యూరిఫైర్, డ్యూయెల్ కెమెరా ఉన్నాయి. అయితే కొత్త అల్కాజార్ లో డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ను మార్చారు. అలాగే వెంటిలేటేడ్ సీట్లను అమర్చారు. వీటితో పాటు ఇతర ప్రీమియం ఫీచర్లను యాడ్ చేశారు.

ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అల్కాజార్ ను రూ.16.77 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.21.28 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ ధరలో కాస్త మార్పు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక హ్యుందాయ్ ఇప్పటి వరకు ఎక్స్ టర్, వెన్యూ, క్రెటా ఎస్ యూవీలను విక్రియతస్తోంది. వీటిలో కంటే కొత్త అల్కాజార్ లో ఐకానిక్ 5 ఎలక్ట్రానిక్ ఎస్ యూవీగా భావించవచ్చని అంటున్నారు.