Diwali Offer 2023: భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ శుభకార్యం చేయాలంటే మంచి రోజుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే కొత్త వస్తువులను పండుగల సమయాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొన్ని కంపెనీలు సైతం పండుగల సమయంలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా దసరా, దీపావళి సందర్భంగా వివిధ రకాల వస్తువులను తక్కువ ధరకే అందిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే ఈ సమయాల్లో అమ్మకాలు సైతం విపరీతంగా పెరుగుతాయి. ఈ ఏడాది దీపావళి సందర్భంగా కార్ల కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ఏ కారు ఎంత ధరకు తగ్గించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
పండుగ సీజన్లో కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ప్రధానంగా వెహికిల్ ఈ సందర్భంగా కొనుగోలు చేస్తే మంచి జరగుతుందని చాలా మంది నమ్మకం. అందువల్ల దీపావళి సందర్భంగా 4 వీలర్ ను కొనుగోలు చేస్తుంటారు. ఈ దీపావళి సందర్భంగా కొన్ని కార్ల కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. సాధారణ రోజుల్లో కంటే ఈ సమయంలో వాటిపై భారీగా తగ్గింపును ఇస్తూ అమ్ముతున్నాయి.
కార్ల కంపెనీల్లో భారీ ఆఫర్లు ప్రకటించిన వాటిలో హోండా సిటీ ముందుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన హోండా సిటీ కారుపై ఏకంగా రూ.90,000 తగ్గింపును ప్రకటించింది. ఆ తరువాత ఇదే కంపెనీ నుంచి రిలీజ్ అయిన అమేజ్ మోడల్ పై రూ.70,000 డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆ తరువాత స్కోడా స్లావియా రూ.75,000 తగ్గింపుతో విక్రయిస్తుంది. వోక్స్ వ్యాగన్ పై రూ.80,000, మారుతి సుజుకీ నుంచి రూ.40,000, హ్యుందాయ్ వెర్నా రూ.30,000 తగ్గింపు ధరతో అమ్ముతోంది.
ఈ ఏడాది కార్ల వినియోగదారులు విపరీతంగా పెరిగిపోయారు. ఈ క్రమంలో కంపెనీలు సైతం వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్ ను ప్రకటించాయి. ముఖ్యంగా ఈ దీపావళి సందర్భంగా బంఫర్ బోనాంజాను ముందు ఉంచిది. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ ఆఫర్లకు ఆకర్షితులై కార్లను కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి మీరు కూడా కారు కొనాలని అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి..