దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని ప్రజల కోసం ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్సూరెన్స్ డబ్బులను నామినీ మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలా..? లేక కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేసుకోవచ్చా..? అనే అనుమానం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీదారుడు చనిపోయిన పక్షంలో నామినీగా ఎవరి పేరు ఉంటుందో వాళ్లు డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ లో మాత్రమే పాలసీ డబ్బులను క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పాలసీ కట్టిన హోమ్ బ్రాంచ్‌కు వెళ్లడం ద్వారా పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాలసీదారు ఏజెంట్ లేదా ఆ ఏరియా డెవలప్‌మెంట్ ఆఫీసర్‌తో సంతకం చేయించుకుని ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. హోమ్ బ్రాంచ్ లో మొదట పాలసీదారుడు చనిపోయిన విషయాన్ని తెలియజేయాలి.
ఆ తర్వాత బ్రాంచ్ అధికారులు ఇచ్చిన ఫామ్ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్‌లను నింపాలి. పాలసీదారుడి డెత్ సర్టిఫికెట్ తో పాటు ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని నామినీ వాటిపై సంతకం పెట్టాలి. వీటితో పాటు ఒక ఇంటిమేషన్ లెటర్ ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
నామినీ, పాలసీదారుడికి సంబంధించిన ఒరిజినల్ ఐడి కార్డులను వెరిఫికేషన్ సమయంలో అధికారులు చెక్ చేస్తారు. ఆ తర్వాత డెత్ క్లెయిమ్ కు సంబంధించిన అప్లికేషన్ ను ఆన్ లైన్ లో సబ్మిట్ చేస్తారు. ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.