Waaree Energies IPO allotment: వారీ ఎనర్జీస్ ఇండియాలో వాటా కేటాయింపు ఎలా తెలుసుకోవాలి..?

సోలార్ ప్యానెల్ తయారీదారు వారీ ఎనర్జీస్ లిమిటెడ్ వాటా కేటాయింపు స్థితి అక్టోబర్ 24వ తేదీ- గురువారం ఖరారుకానుంది.

Written By: Mahi, Updated On : October 24, 2024 12:52 pm

Waaree Energies IPO allotment

Follow us on

Waaree Energies IPO allotment: 1990లో స్థాపించిన వారీ ఎనర్జీస్ జూన్ 30, 2024 నాటికి 12 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో భారతదేశపు అతిపెద్ద సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీదారు. సోలార్ ప్యానెల్ తయారీదారు వారీ ఎనర్జీస్ లిమిటెడ్ వాటా కేటాయింపు స్థితి అక్టోబర్ 24వ తేదీ- గురువారం ఖరారుకానుంది. అక్టోబర్ 21 నుంచి 24 వరకు 3 రోజుల పాటు జరిగిన ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. రూ. 4,321.44 కోట్ల ప్రారంభ వాటా విక్రయం 76.34 సార్లు సబ్ స్క్రైబ్ కాగా.. 2,10,79,384 షేర్లకు గానూ 1,60,91,61,741 ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) తమకు కేటాయించిన కోటాకు 208.63 రెట్లు సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 62.48 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 10.79 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది. ఒక్కో షేరు ధర రూ. 1,427 నుంచి రూ. 1,503 వరకు ఉన్న ఈ ఐపీఓకు అత్యధికంగా రూ. 97.34 లక్షల దరఖాస్తులు రాగా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, టాటా టెక్నాలజీస్ వరుసగా 90 లక్షల దరఖాస్తులు, 73 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

సబ్ స్క్రిప్షన్ విండో క్లోజ్ కావడంతో గురువారం ఖరారు కానున్న వారీ ఎనర్జీస్ ఐపీఓ కేటాయింపు స్థితిని తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. రిజిస్ట్రార్ లింక్ ఇన్‌టైమ్ ఇండియా, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వెబ్ సైట్లలో స్టేటస్ స్థితిని గురించి తెలుసుకోవచ్చు.

‘లింక్ ఇన్ టైమ్ ఇండియా’లో స్టేటస్ చెక్ చేయడం ఎలా?
* లింక్ ఇన్ టైమ్ ఇండియా యొక్క అధికారిక పోర్టల్ https://www.linkintime.co.in/ను సందర్శించండి.
* ‘ఇన్వెస్టర్ సర్వీసెస్’ ట్యాబ్ లోకి వెళ్లండి.
* ‘పబ్లిక్ ఇష్యూ’ను ఎంచుకోండి
* ఐపీఓ పేర్ల డ్రాప్ డౌన్ మెనూ నుంచి ‘వారీ ఎనర్జీస్’ ఎంచుకోండి.
* మీ అప్లికేషన్ నెంబరు, DP/క్లయింట్ ఐడీ, పాన్, లేదా అకౌంట్ నెంబరు/ IFSC తో ఫిల్ చేయండి.
* సబ్మిట్ మీద క్లిక్ చేయండి, కేటాయింపు స్థితి మీ స్క్రీన్ పై చూపిస్తుంది.

‘ఎన్ఎస్ఈ’లో..
ఎన్ఎస్ఈ- www.nseindia.com/products/dynaContent/equities/ipos/ipo_login.jsp యొక్క కేటాయింపు స్థితి సందర్శించండిwww.nseindia.com/products/dynaContent/equities/ipos/ipo_login.jsp
* మీకు ఖాతా ఉంటే లాగిన్ అవ్వండి. కొత్త యూజర్లు సైన్ అప్ చేయాల్సి ఉంటుంది.
* ‘వారీ ఎనర్జీస్’ ఎంచుకోండి
* పాన్ వివరాలను వెరిఫై చేయండి, ఐపీఓ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయండి
* ‘సబ్మిట్’పై క్లిక్ చేయండి.
* బీఎస్ఈ (గతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) అధికారిక వెబ్ సైట్ కూడా వారి ఎనర్జీస్ ఐపీఓ కేటాయింపు స్థితిపై సమాచారాన్ని అందిస్తుంది.

వారీ ఎనర్జీస్ ఐపీఓ లిస్టింగ్ తేదీ..
ఈక్విటీ షేర్లను కేటాయించిన ఇన్వెస్టర్లు అక్టోబర్ 25-శుక్రవారం తమ డీమాట్ అకౌంట్ లో జమ చేస్తారు. విఫలమైన పెట్టుబడిదారులకు రీఫండ్లు అదే తేదీన ప్రాసెస్ చేయబడతాయి. వారీ ఎనర్జీస్ ఐపీఓ లిస్టింగ్ తేదీ అక్టోబర్ 28. ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అవుతాయి.

రూ. 3,600 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లు, రూ. 721.44 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ కలయికతో ఈ ఐపీఓ జరిగింది. సేకరించిన నిధులను 6 గిగావాట్ల ఇంగోట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.