Mutual Funds: ఉద్యోగం, వ్యాపారం.. రంగం ఏదైనా డబ్బు సంపాదించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం. వివిధ మార్గాల ద్వారా కష్టపడడం ద్వారా వచ్చిన ధనాన్ని కొంత అవసరాలకు ఉపయోగించుకొని మరికొంత సేవింగ్స్ చేసుకుంటారు చాలా మంది. భవిష్యత్ అవసరాల కోసం కొందరు డబ్బులను బ్యాంకులో వేసుకుంటే మరికొందరు చిట్టీలు కట్టి సేవింగ్స్ చేస్తారు. వీటిల్లో డబ్బు పెట్టడం ద్వారా మహా అయితే 20 నుంచి 30 వేల వరకు వడ్డీ వస్తుంది. కానీ ఇదే మొత్తాన్ని ఇతర మార్గాల్లో పెట్టడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించవచ్చని అంటున్నారు ఆర్థిక నిపుణులు. చాలా మంది ఈ విషయాలు తెలియక కాలం, డబ్బు వృథా చేసుకుంటున్నారు. చిట్టీల్లో పెట్టే డబ్బులే అందులో పెడితే కనీసం కోటీ రూపాయల వరకు వడ్డీ వస్తుందని అంటున్నారు.
ప్రతి ఒక్కరూ కష్టపడేది ఫైనల్ గా డబ్బు సంపాదించడానికే. కానీ వచ్చిన మొత్తాన్ని సేవ్ చేయడంలో చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం ఆర్థిక నిపుణులు విలువైన సలహాలు ఇస్తున్నారు. డబ్బు సేవింగ్ చేసేవారు సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న చాలా మంది ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు చిట్టీల మీదనే ఆధారపడుతున్నారు. చిట్స్ ల్లో వచ్చే చిన్న వడ్డీకే ఆశపడి తమ డబ్బంతా వృథా చేసుకుంటున్నారని అంటున్నారు.
వచ్చే ఆదాయంలో చిన్న మొత్తాలతో మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెడితే కొన్ని సంవత్సరాల తరువాత అత్యధిక వడ్డీని తిరిగి పొందవచ్చని అంటున్నారు. ఉదాహరణకు రూ.10ని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే 30 సంవత్సరాల తరువాత రూ.3 కోట్ల రూపాలు తిరిగి వస్తాయని అంటున్నారు. అలా మీ సౌకర్యవంతమైన డబ్బును మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టడం వల్ల అధిక మొత్తాన్ని తీసుకోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఇందులో డబ్బుులు పెట్టడం ద్వారా తీసుకునే సమయానికి మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బు అధికంగా కూడా రావచ్చని అంటున్నారు.
చిట్టీలో మోసాలు ఎక్కువగా కావడం వల్ల చాలా మంది బ్యాంకుల్లో సేవ్ చేసుకుంటున్నారు. బ్యాంకుల్లో సేవ్ చేయడం వల్ల మినిమం వడ్డీ మాత్రమే వస్తుంది. ఒకవేళ ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా కాస్త ఎక్కువ రావొచ్చు. అయితే ఫిక్స్ డ్ చేస్తే ఎమర్జేన్సీ సమయంలో రిలీజ్ చేస్తే చాలా తక్కువ వడ్డీని పొందుతారు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మధ్యలో అవసరం మేరకు తీసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూడండి..