Debt relief tips Telugu : ప్రస్తుత కాలంలో ఆదాయంతో పాటు అవసరాలు పెరిగిపోయాయి. దీంతో నచ్చిన ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని ఖర్చులు తీర్చుకోవడానికి అప్పుడు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు అప్పులు ఎవరు ఇచ్చేవారు కాదు. దీంతో చాలా వరకు అవసరాలను తగ్గించుకునేవారు. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాల ద్వారా డబ్బు చలామణి ఎక్కువగా ఉండడంతో అవసరంలేని కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం.. వృధా ఖర్చులు చేయడం జరుగుతుంది. ఫలితంగా అప్పులు పెరిగిపోతున్నాయి. అయితే పెరిగిన అప్పుల నుంచి బయటపడడానికి కొందరు కొందరు తీవ్ర మనోవేదన చెందుతారు. కానీ రెండు మెథడ్స్ మారడం వల్ల వాటి నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. ఆ రెండు మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
స్నో బాల్ మెథడ్:
ఒక మంచు పర్వతం మీద ఒక చిన్న బంతిలాగా తయారు చేయండి. అలా తయారు చేసిన బంతిని గుట్టలా ఉన్న స్నో పైనుంచి కిందికి జార విడవడం వల్ల.. ఆ బాల్ పెద్దదిగా మారుతుంది. అంటే అప్పులు కూడా చిన్నఅప్పుతో మొదలై పెద్ద అప్పులుగా పెరిగిపోతాయి. చాలావరకు అప్పులు చేసిన తర్వాత వాటిని తీర్చడానికి ఏమాత్రం ఆలోచన రాకుండా ఉంటుంది. అయితే స్నోబాల్ చిన్నదాని నుంచి పెద్దదిగా మారకముందే దానిని కరిగించేసేయాలి. అంటే అప్పులు తక్కువగా ఉన్నప్పుడు వెంటనే వాటిని తీర్చేయాలి. ఒక పేపర్ పై ఎన్ని అప్పులు ఉన్నాయో రాసుకొని.. ఒక్కొక్కటి తీర్చుకుంటూ రావడం వల్ల ఆర్థిక భారం తగ్గిపోతుంది. ఈ మెథడ్ ను ఫాలో అయి చిన్న అప్పుల నుంచి పెద్ద అప్పులను తీరుస్తూ మొత్తంగా అప్పులు లేకుండా బయటపడవచ్చు.
ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు తీర్చడం:
రకరకాల అవసరాల కోసం ఎన్నో అప్పుడు చేస్తాం. అయితే ఒక్కోసారి అత్యవసరం ఏర్పడినప్పుడు ఎక్కువ వడ్డీతో అప్పులు చేయాల్సి వస్తుంది. కానీ ఆ తర్వాత ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడినప్పుడు ముందుగా ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను తీర్చాలి. అవసరమనుకుంటే తక్కువ వడ్డీకి కొత్త అప్పు చేసి ఎక్కువ వడ్డీ ఉన్న అప్పును తీర్చడం వల్ల కొంతవరకు ఆదాయం పెరుగుతుంది. అలా మెల్లిగా ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ రావాలి.
అప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడడం కంటే.. వాటిని ఒక పేపర్ పై రాసుకొని ఒక్కో అప్పును ఎలా తీర్చాలి అని ఆలోచించడం వల్ల.. తొందరగా ఆ ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.