Teacher’s Day 2021: గురుదేవో భవ.. ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకతలు తెలుసా?

Teacher’s Day 2021:  గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ: గురువును సాక్షాత్ దైవంతో పోలుస్తారు. పూర్వ కాలంలో గురుకులాలు ఉండేవి. అంటే విద్యార్థి మొత్తం విద్య నేర్చుకునే చోటు. అక్కడ తన జీవితానికి ఉపయోగపడే విద్యలన్ని అక్కడే నేర్చుకుని బయటకు వచ్చేవారు. గురు శిష్యుల బంధం అనేది ఓ మహత్తరమైన మహిమాన్వితమైనదిగా గుర్తిస్తారు. గు అంటే చీకటి. రు అంటే పోగొట్టేది అని అర్థం. మనలోని అవివేకాన్ని దూరం చేసేది […]

Written By: Srinivas, Updated On : September 5, 2021 11:19 am
Follow us on

Teacher’s Day 2021:  గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ:

గురువును సాక్షాత్ దైవంతో పోలుస్తారు. పూర్వ కాలంలో గురుకులాలు ఉండేవి. అంటే విద్యార్థి మొత్తం విద్య నేర్చుకునే చోటు. అక్కడ తన జీవితానికి ఉపయోగపడే విద్యలన్ని అక్కడే నేర్చుకుని బయటకు వచ్చేవారు. గురు శిష్యుల బంధం అనేది ఓ మహత్తరమైన మహిమాన్వితమైనదిగా గుర్తిస్తారు. గు అంటే చీకటి. రు అంటే పోగొట్టేది అని అర్థం. మనలోని అవివేకాన్ని దూరం చేసేది కూడా గురువే. గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంప్రదాయం మనది.

భారతరత్న, భారతదేశ తొలి ఉప రాష్ర్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన 1888ల తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా భావించి గౌరవిస్తోన్నారు. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.

మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునులను కూడా గరుశిష్యులుగా భావిస్తారు. సర్వేపల్లి, మహాత్మాగాంధీలది కూడా గురుశిష్యుల అనుబంధమే. ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. శిష్యులు గురువులను పూజించి కొలుస్తారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన వారిని మరిచిపోకుండా వారికి తోచిన విధంగా బహుమతులు అందజేస్తూ పూజిస్తారు.

పురాతన కాలం నుంచి తీసుకుంటే గురుశిష్యుల బంధం గురించి ఎంత చెప్పిన తక్కువే. రామకృష్ణ పరమహంస వివేకానందుడిది ఆదర్శ సంబంధమే. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు, సమర్థ రామదాసు శివాజీలదీ అదే కోవ. భారతీయ సంస్కృతిలో గురుశిష్యుల పరంపర కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మంలో గురుశిష్యుల బంధం ఓ సుందరమైన బంధమే.

శిష్యులను గొప్పవారిగా తయారు చేయడంలో గురువుల పాత్ర అనిర్వచనీయమైనది. పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా గురువు శిష్యులను అన్నింటా రాణించేందుకు అన్ని మార్గాల్లో ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకునే విధంగా తయారు చేస్తారు. గురువు కోసం శిష్యులు సేవలు చేస్తారు. వారిని ప్రసన్నం చేసుకుని వారికి కావాల్సిన విద్య నేర్చుకుని జీవితంలో ఆశయాలు సాధించుకునేందుకు సిద్ధమవుతారు.