Homeబిజినెస్Honda SP125 : హీరో సూపర్ స్ప్లెండర్‌కి పోటీగా హోండా కొత్త బైక్.. ధర, ఫీచర్లు...

Honda SP125 : హీరో సూపర్ స్ప్లెండర్‌కి పోటీగా హోండా కొత్త బైక్.. ధర, ఫీచర్లు ఇవే

Honda SP125 New Model : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) హోండా SP125 అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసింది. కొత్త మోటార్‌సైకిల్ డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో పరిచయం చేయబడింది. డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.91,771. హోండా దీనికి కొత్త ఫీచర్లు, కొత్త నిబంధనల ప్రకారం పనిచేసే ఇంజిన్‌ను అందించింది. భారతదేశంలో ఇది హీరో సూపర్ స్ప్లెండర్‌తో పోటీపడుతుంది. హోండా కొత్త బైక్‌ను ఏ ఫీచర్లతో విడుదల చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. హోండా SP125.. 125సీసీ సెగ్మెంట్‌లో ఒక పాపులర్ బైక్. కొత్త ఫీచర్లతో మార్కెట్లో దీని ఎంట్రీ మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది. తాజా అప్‌డేట్‌తో దీని స్టైల్, పనితీరు, ఫీచర్లను మెరుగుపరిచింది కంపెనీ. కొత్త హోండా SP125 మోటార్‌సైకిల్‌లో కొత్తగా ఏం చూడవచ్చో ఈ వార్తలో చూద్దం.

కొత్త రంగులు
హోండా SP125 డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ 125cc కమ్యూటర్ బైక్ ఐదు కొత్త రంగు ఎంపికలతో వస్తుంది. ఇది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. హోండా SP125 తాజా వెర్షన్ కొత్త ఆల్-LED హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. దీనికి ఎక్స్ టెండెడ్ ట్యాంక్ అందించింది కంపెనీ. అంతేకాకుండా కొత్త బైకుకు అగ్రెసివ్ లుక్ ఇచ్చింది.

కొత్త ఫీచర్లు
హోండా SP125 కొత్త ఫీచర్ల గురించి చెప్పాలంటే, కొత్త మోటార్‌సైకిల్ ఇప్పుడు 4.2-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, USB C-టైప్ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. దీనిలో అతిపెద్ద మార్పు Honda RoadSync యాప్ ద్వారా ఉపయోగించబడే టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ సిస్టమ్ తో రానుంది.

ఇంజిన్, ధర
హోండా SP125.. కొత్త మోడల్ 124cc, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. రాబోయే ఉద్గార నిబంధనలకు అనుగుణంగా.. ఇది OBD2Bతో అమర్చబడింది. ట్రాన్స్‌మిషన్ కోసం 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది. ఇది ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌తో కూడా వస్తుంది, ఇది మెరుగైన మైలేజీని ఇస్తుంది.

హోండా SP125 డ్రమ్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.91,771 కాగా, డిస్క్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,00,284. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే, డ్రమ్ వేరియంట్ ధర రూ. 4,303, డిస్క్ వేరియంట్ ధర రూ. 8,532. భారతదేశంలో, హోండా SP125 హీరో సూపర్ స్ప్లెండర్, బజాజ్ పల్సర్ N25, TVS రైడర్, Hero Xtreme 125 లకు పోటీగా ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular