Honda Shine 125: రోజువారి వినియోగదారులు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే బైక్స్ అందించడంలో Honda కంపెనీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇదివరకు Hero Honda గా ఉన్నప్పుడు ఈ కంపెనీ అత్యంత మెరుగైన ఇంజన్ తో పాటు మంచి మైలేజ్ ఇచ్చే బైక్ లను అందించింది. అయితే Honda గా మారిన తర్వాత కూడా ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంటుందని కొందరు వాహనదారులు అంటున్నారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఈ బైక్ అన్ని విషయాల్లోనూ అప్డేట్ అవుతూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఫిబ్రవరి 5న హోండా షైన్ 125 న్యూ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ లో కొన్ని మార్పులు చేశారు. అంతేకాకుండా ధర విషయంలో కూడా మారిందని తెలుస్తోంది. ఇంతకీ ఈ కొత్త బైక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన Honda Shine 125 బ్లూ రంగులో కనిపిస్తుంది. ఇప్పటివరకు బ్లాక్ కలర్ లో కనిపించిన ఈ షైన్ కొత్త గ్రాఫిక్స్ తో బైకు కు అందం తీసుకొచ్చింది. దీన్ని చూడగానే బైక్ చాలా ఖరీదు అయినది అని అనిపిస్తుంది. ఈ బైక్ లో 125 సిసి ఇంజన్ తో పాటు 10.6 బీహెచ్పీ పవర్ ను అందిస్తుంది. అలాగే 11 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 55 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. దీని ముందటి భాగంలో NM కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం ఉండడంతో బైక్ కు రక్షణగా ఉంటుంది. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ ధర రూ.1,000 ఎక్కువగా చేశారు. దీంతో ఇప్పుడు దీనిని రూ.86,211 ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ధర ఎక్కువ అయినప్పటికీ ఇందులో ఉండే ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో 15W USB C పోర్ట్ చార్జింగ్ కోసం అందుబాటులో ఉంది. అలాగే టెలిస్కోప్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫైవ్ స్టెప్పు అడ్జస్ట్బుల్ రియర్ ట్విన్ షాక్ అబ్జర్వ్ ఉండడంతో గతుకుల రోడ్లపై కూడా సులభంగా ప్రయాణం చేయడానికి అనుగుణంగా ఉంటుంది.
ఎక్స్టీరియర్ డిజైన్ లోన్ ఆకర్షణీయమైన పరికరాలు ఉంటాయి.5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఇంజన్ కట్ ఆఫ్ తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటివి సేఫ్టీని ఇస్తాయి. రోజువారి వినియోగదారులతో పాటు యూత్ సైతం ఈ బైక్ పై రైడింగ్ చేస్తే ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు.