Honda amaze 2026: Honda కంపెనీకి చెందిన కార్లు ప్రీమియం లుక్ ను అందిస్తూ ఉంటాయి. ఈ కారు డిజైన్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు ఇంజన్ విషయంలో మెరుగైన పనితీరు ఉండడంతో చాలామంది దీనిని కొనాలని ఆసక్తి చూపుతారు. అయితే ఈ కంపెనీ 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఇప్పటికే ఉన్న amaze అనే కారును అప్డేట్ చేసి తీసుకువస్తుంది. కాంపాక్ట్ సెడాన్ విభాగానికి చెందిన ఈ కారు లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నా కూడా ధర తక్కువగా నిర్ణయించారు. దీంతో ఈ కారును కొనాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.
Honda Amaze గురించి కార్ల వినియోగదారులకు ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే ఇది ఇప్పుడు అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే ముందు భాగంలో క్రోమ్ యాక్సిడెంటు గ్రీన్ హైలెట్ కానుంది. దీనికి స్టైలిష్ తో కూడిన LED లో ఉండనున్నాయి. అల్లాయి వీల్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్ LED లైట్స్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి. దీంతో పట్టణ రోడ్లపై ఈ కారులో వెళ్తే అద్భుతంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇన్నర్ లోను ఈ కారు విశాలమైన స్పేస్ ను కలిగి ఉంది. క్యాబిన్తోపాటు ప్రయాణికులకు అనుగుణంగా బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ లో కూడా ఏర్పాటు చేశారు. దీంతో సుదూరం ప్రయాణం చేసే వారికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఇందులో ఉండే సీటింగ్ కాన్ఫిగరేషన్ గా ఉండడంతో రోజు ప్రయాణం చేసేవారు అనుభూతిని చెందుతారు.
ఈ కారులో ఇంజన్ విషయానికి వస్తే పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇవి ఆటోమేటిక్ తో పాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్లతో పనిచేస్తాయి. దీంతో డ్రైవర్లకు స్మూత్ గోయింగ్ ఉంటుంది. అలాగే కొత్త అనుభూతిని చెందుతారు. హైవే రోడ్లపై, గతుకులు ఉన్న రోడ్లపై కూడా సాఫీగా వెళ్లేలా ఇంజన్లు మృదువైన నిర్వహణను కలిగి ఉంటాయి. ఈ కొత్త హోండా కారులో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు. ఆధునికరించబడిన ఇంఫోటైన్మెంట్ సిస్టంతో పాటు టచ్ స్క్రీన్ డిస్ప్లే, నావిగేషన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ తోపాటు స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆడియో సిస్టం తో పాటు మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్టులు సౌకర్యాన్ని కలిగిస్తాయి. డ్రైవర్ దృష్టి మరచ్చకుండా ఆపరేట్ చేసుకునేందుకు వాయిస్ స్టీరింగ్ మౌంటెడ్ కూడా కొత్తదనాన్ని అందిస్తుంది. ఈ కారులో సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD తో కూడిన ఏపీఎస్, రియర్ బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి రక్షణను ఇస్తాయి.
ఇప్పటికే ఉన్న సెడాన్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ కారును రూ.7 లక్షల కే విక్రయించాలని చూస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ వెదర్ ను అందించే ఈ కారు త్వరలో మార్కెట్లోకి రాబోతుంది.