Homeబిజినెస్Honda Activa CNG mileage 100 km: 100 కిలోమీటర్ల మైలేజ్.. 95 వేల లోపే...

Honda Activa CNG mileage 100 km: 100 కిలోమీటర్ల మైలేజ్.. 95 వేల లోపే ధర.. ఈ స్కూటర్ గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

Honda Activa CNG mileage 100 km: రోజువారి అవసరాలతో పాటు.. చిన్నపాటి ప్రయాణాలు చేసేవారు బైక్ కంటే స్కూటర్ బెటర్ అని నేటితరం వారు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఉండే స్కూటర్ అభివృద్ధి చెంది ఇప్పుడు స్మార్ట్ గా డిజైన్ చేసుకొని మార్కెట్లోకి వస్తుంది. ఈ స్కూటర్ పెట్రోల్ వేరియంట్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ గా కూడా అలరిస్తోంది. అయితే స్కూటర్ విభాగంలో Honda కంపెనీకి చెందిన Activa గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది ఆదరణ పొందిన ఈ స్కూటర్ ఇప్పుడు CNG వేరియంట్ లో రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటికే దీని గురించి సమాచారం ఆన్లైన్ లో లీక్ అయింది. పెట్రోల్ తో ఇబ్బంది పడేవారు.. విద్యుత్ వాహనాలు అంటే ఇష్టం లేనివారు ఈ CNG స్కూటర్ కొనుగోలు చేస్తారని కంపెనీ ప్రతినిధులు నమ్ముతున్నారు. మరి పెట్రోల్ విభాగంలో సక్సెస్ అయిన హోండా యాక్టివా CNG స్కూటర్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

Honda Activa CNG కొత్త స్కూటర్ డిజైన్ భారతీయ రైడర్లకు అనుగుణంగా ఉంది. ఒకవైపు రోజు వారి వినియోగదారులతో పాటు యూత్ కు అట్రాక్షన్ గా ఉండేలా దీని డిజైన్ చేశారు. కాంట్రాక్టు బాడీ, సౌకర్యంగా ఉండే ఎర్గోనామిక్స్, కొత్తగా తయారు చేసిన లైటింగ్, మెరుగైన బాడీ ప్యానెల్ వంటివి ప్రీమియం లుక్ ను అందిస్తాయి. ఈ స్కూటర్ పెట్రోల్ తో పాటు CNG వేరియంట్ ఉండడం విశేషం. దీంతో ఇది సాంప్రదాయ పెట్రోల్ వాహనాల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా గ్యాస్ తో ప్రయాణం చేయడం వల్ల ఎలాంటి వాతావరణం కాలుష్యం కాకుండా ఉండడంతోపాటు పెట్రోల్ ధరల ఖర్చుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ఇంజన్ కిలో ఇంధనానికి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని అంటున్నారు. దీంతో రోజువారి ప్రయాణికులకు ఇది ఎంతో సేవ్ చేసినట్లు అవుతుంది.

ఈ కొత్త యాక్టివా CNG స్కూటర్ లో నేటితరం వారికి అనుగుణంగా ఉండేలా స్మార్ట్ ఫీచర్స్ ను అమర్చారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే ఉండడంతో ఇందులో నావిగేషన్, రైడింగ్ మోడ్ వంటివి చూసుకోవచ్చు. ఈ స్కూటర్ సీట్ కింద తగినంత స్పేస్ ఉండడంతో వస్తువులు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో CNG లీక్ డిటెక్షన్ సిస్టం, సేఫ్టీ సిలిండర్ మౌంటింగ్ ను కలిగి ఉండడంతో రైడర్లకు సేఫ్టీ గా ఉంటుంది. దీనిని రూ. 95 ,000 కంటే తక్కువ ధరలోనే విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో నగరాల్లో ఉండేవారు తమ అవసరాల కోసం కొత్త స్కూటర్ కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular