spot_img
Homeబిజినెస్మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా Honda Activa 7G.. దీని ధర ఎంతో తెలుసా?

మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా Honda Activa 7G.. దీని ధర ఎంతో తెలుసా?

Honda కంపెనీకి చెందిన చాలా బైక్స్, స్కూటర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రోజువారి వినియోగదారులతో పాటు స్టైలిష్ గా ఉండాలని అనుకునేవారు ఈ కంపెనీకి చెందిన వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం స్కూటర్ల ట్రెండు నడుస్తుండడంతో.. హోండా కంపెనీ కొత్తగా Activa 7G స్కూటర్ను అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. ఇప్పటికే Activa ఎంతోమందిని అలరించింది. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా.. ఫీచర్లను, ఇంజన్ పనితీరును మార్చి మార్కెట్లో ప్రవేశపెట్టబడుతుంది. అయితే కొత్తగా వచ్చే ఈ స్కూటర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

మార్కెట్లోకి రాబోతున్న Honda Activa 7G 125 సిసి ఇంజన్ తో రాబోతుంది. ఈ స్కూటర్ ఎక్స్టీరియర్ డిజైన్ లో భాగంగా LED డే టైం రన్నింగ్ లైట్లు అమర్చబడ్డాయి. ఇవి రాత్రి, పగలు అని తేడా లేకుండా ఉండడంతో డ్రైవింగ్ అనుకూలంగా ఉంటుంది. బాడీ మెటీరియల్ కూడా మన్నిక కోసం మెటల్ భాగాలను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. అలాగే ఆకర్షణీయమైన రంగులతో మార్కెట్లోకి రాబోతున్నాయి.

ఈ స్కూటర్లో స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించనున్నారు. దీనికి పూర్తిగా డిజిటల్ TFT స్క్రీన్ ను కలిగే ఉంటుంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యవంతంగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకొని బోర్డు నావిగేషన్, కాల్ అలర్టు, టెక్స్ట్ మెసేజ్ కూడా చూసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ కంట్రోల్ కూడా ఒకరేవంతంగా ఉంటుంది. స్టాండర్డ్ ఫీచర్లలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, హైడ్లింగ్ స్టాఫ్ సిస్టం, యూఎస్బీ పోర్టు ఉండనున్నాయి. కొత్తగా వచ్చే యాక్టివా స్కూటర్లో ఇంజన్ 125 సిసి తో పనిచేయనుంది. దీంతో నగర ప్రయాణంతోపాటు దూర ప్రయాణం చేసేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది. ఓవర్ టేకింగ్ కూడా వైబ్రేషన్ లేకుండా చేసుకోవచ్చు. రోట పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇంజన్ ఇబ్బందులేకుండా ఉంటుంది.

ఈ స్కూటర్ ధరను రూ.99,000 నుంచి రూ. 1.25 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి వస్తే టీవీఎస్ జూపిటర్, సుజుకి అవేనిస్, ఈరోజు జూమ్ 110 వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చే ఈ స్కూటర్ మైలేజ్ కూడా వినియోగదారులకు అనుగుణంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో చాలామంది నగర ప్రయాణికులు స్కూటర్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular