కరోన ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత వ్యక్తిగత వాహనాలను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే కొత్త బైక్ ను కొనుగోలు చేసే సామర్థ్యం లేని చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్ లను కొనుగోలు చేస్తున్నారు. మంచి మైలేజీ ఇచ్చే బైక్ లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దేశంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మైలేజ్ పై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.
హీరో కంపెనీ నుంచి వచ్చి స్ప్లెండర్ బైక్ 81 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. ఈ బైక్ ను కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం వారంటీని పొందే అవకాశం కూడా ఉంటుంది. సరసమైన ధరలో బైక్ ను కొనుగోలు చేసేవాళ్లకు ఈ ఆఫర్ మంచి ఆఫర్ అని చెప్పవచ్చు. కార్స్ 24 వెబ్ సైట్ ద్వారా ఈ సెకండ్ హ్యాండ్ బైక్ ను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ బైక్ 2011 మోడల్ కాగా బైక్ ధర కేవలం 22వేల రూపాయలుగా ఉంది.
సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను ఈ బైక్ కలిగి ఉండగా ఇంజన్ 8.02ps పవర్ , 8.05nm టార్క్ తో ఈ బైక్ పని చేస్తుంది. వారంటీ కూడా లభిస్తూ ఉండటంతో ఈ బైక్ ను కొనుగోలు చేసినా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. ఈ వారంటీ బైక్ లోని అన్ని భాగాలకు వర్తిస్తుందని సమాచారం. ఈ బైక్ తో 7 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది.
7 రోజులు బైక్ ను వినియోగించిన తర్వాత బైక్ నచ్చకపోతే బైక్ ను వెనక్కు ఇచ్చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసేవాళ్లకు ఈ బైక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో బైక్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లు వెంటనే ఈ బైక్ ను కొనుగోలు చేస్తే మంచిది.