Homeబిజినెస్Maruti Suzuki Grand Vitara: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు ధరపై SM లో ఇంట్రెస్టింగ్...

Maruti Suzuki Grand Vitara: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు ధరపై SM లో ఇంట్రెస్టింగ్ చర్చ..

Maruti Suzuki Grand Vitara: Maruti Suzuki కార్లు అనగానే చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటాయని అంటుంటారు. కానీ ఇది ప్రీమియం కార్లను కూడా మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎక్కువగా డిమాండ్ ఉన్న ఎలక్ట్రిక్ వేరియంట్ లో కారును తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనికి E Vitara అనే పేరు ప్రకటించింది. ఇప్పటివరకు దీని నుంచి రిలీజ్ అయిన SUV Grand Vitara వలె ఇది ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీని ధర విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చ సాగుతుంది. ఎక్స్ ఖాతాలో యూజర్ దీని ధర పెట్టడంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించిందా? లేక కొందరు కావాలనే పెట్టారా? అని అంటున్నారు. ఇంతకీ ఈ కారు ధర ఎంత అంచనా వేస్తున్నారంటే?

మారుతి సుజుకి రిలీజ్ చేయబోయే తొలి ఎలక్ట్రిక్ కారు ఈ విటారా గురించి ఇప్పటికే ఆన్లైన్లో సమాచారం ఉంచారు. 4275 mm పొడవు, 2700 mm వీల్ బేస్ కలిగిన ఈ కారుకు 19 అంగుళాల అల్లాయి వీల్స్ ఉండనున్నాయి. ఇన్నర్ లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఉండనుంది. వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో తో పాటు సేఫ్టీ కోసం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ADAS Level 2 టెక్నాలజీ ఇందులో కనిపిస్తుంది.

ఈ కారులో రెండు రకాల బ్యాటరీలు ఉండలున్నాయి. వీటిలో ఒకటి 49kWh ఉండగా.. మరొకటి 61 kWh తో పనిచేస్తుంది. ఈ రెండు బ్యాటరీలు ఒకసారి చార్జింగ్ చేస్తే 543 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 192.5 NM నుంచి 300 NM టార్క్ రిలీజ్ చేస్తుంది. 9 సెకండ్ల లోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే విధంగా దీనిని సెట్ చేస్తున్నారు. అయితే 2026లో మార్కెట్లోకి వచ్చే సూచనలు కల్పిస్తున్న ఈ కారు ధరపై ఆసక్తిగా చర్చ సాగుతోంది. అయితే సోషల్ మీడియాలో కొందరు దీనిని కంపెనీ ప్రకటించిన విధంగా రూ.24 లక్షలు గా తెలుపుతున్నారు. కానీ ఇది ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది. ఎందుకంటే కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ధర గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే కొందరు నిపుణులు వేస్తున్న అంచనా ప్రకారం దీనిని రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో చెబుతున్న ధరను పరిశీలిస్తే SUV కార్ల కంటే ఈ ధర అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అంతలా ఉండదని కొందరు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular