Deepinder Goyal Aerospace Sector: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ వెంట పరుగులు పెడుతోంది. దిగ్గజ సంస్థలు కృత్రిమ మేధలో లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, అమెజాన్, ఆపిల్, స్టార్ లింక్, మెటా వంటి కంపెనీలు లక్షల కోట్లతో భవిష్యత్తు కాలంలో ఉపయోగించే కృత్రిమ మేధను అభివృద్ధి చేస్తున్నాయి..సాంకేతిక పరిజ్ఞానానికి సరికొత్త దిశను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటే.. మన దేశంలోని అంకుర సంస్థగా ఏర్పడి.. వందల కోట్ల వ్యవస్థగా ఆవిర్భవించిన ఓ కంపెనీ అధినేత మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడు. అంతేకాదు విభిన్నమైన వ్యాపారం లోకి అడుగు పెట్టి.. అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
మన దేశంలో జొమాటో అంటే తెలియని వారు ఉండరు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థగా జొమాటో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కరోనా టైంలో రికార్డు స్థాయిలో ఆర్డర్లను డెలివరీ చేసింది.. ఆ సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ LinkedIn లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అది వ్యాపార వర్గాలలో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. జొమాటో సంస్థ సీఈవో గోయల్ కు బెంగళూరులో LAT పేరుతో ఏరోస్పేస్ సెంటర్ ఉంది. అక్కడ గ్యాస్ టర్బైన్ ఇంజన్ల తయారీకి జొమాటో సీఈవో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో గ్యాస్ టర్బైన్, రోటర్లు, కంట్రోల్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేసిన ఇంజనీర్లను ఆయన ఆహ్వానిస్తున్నారు.. మన దేశ ఏరో స్పేస్ రంగాన్ని మార్చడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు గోయల్ చెబుతున్నారు. భారత ఇంజనీర్లకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తామని.. ఒకవేళ విఫలమైనప్పటికీ వారికి మళ్లీ అవకాశాలు ఇస్తామని.. వారికి తగ్గట్టుగా ప్రోత్సాహకాలు కల్పిస్తామని గోయల్ వెల్లడించారు.
వాస్తవానికి ఏరోస్పేస్ రంగంలో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏరో స్పేస్ రంగానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భవిష్యత్తు కాలంలో ఏరో స్పేస్ రంగం లక్షల కోట్లను దాటిపోతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వాస్తవ రూపం దాల్చితే ఈ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ఖాయం. పైగా ఈ రంగానికి కేంద్రం భారీగా ప్రోత్సాహకాలు కల్పిస్తున్న నేపథ్యంలో.. జొమాటో సీఈవో లాంటి వాళ్లు సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పరిధిలో మాత్రమే పనిచేస్తుంది. ఏరో స్పేస్ అలా కాదు. పైగా ఇందులో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తోంది