https://oktelugu.com/

వాహనదారులకు కేంద్రం శుభవార్త.. ఆ గడువు పొడిగింపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు తీపికబురు అందించింది. మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, ఇతర పత్రాలకు సంబంధించిన గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించడం వల్ల వాహనదారులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. Also Read: క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే లాభం..? కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి గడువును మరోమారు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 27, 2021 / 12:23 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు తీపికబురు అందించింది. మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, ఇతర పత్రాలకు సంబంధించిన గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించడం వల్ల వాహనదారులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

    Also Read: క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే లాభం..?

    కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి గడువును మరోమారు పొడిగిస్తున్నట్టు అన్ని రాష్ట్రాలకు లేఖలు అందాయి. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కేంద్రం 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి నెల 31వ తేదీ మధ్య గడువు పూర్తయ్యే పత్రాలకు మాత్రమే ఈ ప్రయోజనాలను అందిస్తోంది.

    Also Read: 170 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

    గతేడాది గడువు ముగిసిన ధ్రువీకరణ పత్రాలు ఈ ఏడాది జూన్ నెల 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇప్పటికే కేంద్రం ఈ గడువును నాలుగుసార్లు పొడిగించగా తాజాగా మరోసారి కేంద్రం ఈ గడువును పొడిగించడం గమనార్హం. శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వాహనదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

    ప్రజలు రవాణాకు సంబంధించిన సేవల విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్టు కేంద్రం చెబుతోంది. వెహికల్ ఫిట్‌నెస్, ఇతర పత్రాలకు సంబంధించి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.