నెల రోజులుగా కర్ణాటకను కుదిపేసిన రాసలీల సీడీ వివాదంలో శుక్రవారం మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిపై కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాసలీలల సీడీ యువతి మూడో వీడియోను విడుదల చేశారు. తాను అజ్ఞాతంలో ఉన్నానని, న్యాయవాది ద్వారా కమిషనర్‌కు ఫిర్యాదు లేఖను పంపుతున్నానని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు. అడ్వొకేట్ కేఎన్ జగదీశ్‌కుమార్ మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు యువతి ఫిర్యాదు లేఖ అందించారు. ఆ వెంటనే రమేశ్ జార్కిహొళిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇప్పుడు.. ఈ రాసలీలల కేసులో మరో ట్విస్ట్ తెరమీదకు రావడంతో సెక్స్ స్కాండిల్ సీడీ గర్ల్ కేసుకు రాజకీయ రంగు అంటుకుంది. సీడీ గర్ల్ ఫోన్ చేసిన ఆడియో టేప్ లీక్ కావడంతో కలకలం రేపింది. కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే.శివకుమార్ మనకు సహాయం చేస్తారని ఆ సీడీ గర్ల్ ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. తన రాజకీయ జీవితం నాశనం చేయడానికి ఓ పముఖ ‘మహానాయకుడు’ స్కెచ్ వేశాడని ఇంతకాలం చెబుతున్న వచ్చిన రాసలీలల సీడీలోని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఆరోపణలు ఇప్పుడు నిజయం అయ్యేటట్లు ఉన్నాయి.
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల వీడియో విడుదలైన తరువాత ఆ సీడీ సుందరి మాయం అయ్యింది. అయితే మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద సీడీ సుందరి కేసు పెట్టిన కొన్ని గంటల్లోనే కన్నడ మీడియాకు ఓ ఆడియో టేప్ రావడం.. సీడీ సుందరి ఆమె కుటుంబ సభ్యులతో 6 నిమిషాల 59 సెకన్లపాటు మాట్లాడడం కలకలం రేపింది. సీడీ సుందరి ఆమె తల్లి, సోదరుడితోపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉంది.
సీడీ సుందరి ఆమె తల్లితో, సోదరుడు చిన్నితో మాట్లాడుతూ మీరు ధైర్యంగా ఉండాలని, మనకు డీకే శివకుమార్ (కేపీసీసీ అధ్యక్షుడు) అనుచరులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని ఆ సీడీ సుందరి విచారంతో కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉంది. సోదరుడు చిన్నీతో పాట్లాడిన సీడీ సుందరి మీడియాలో వచ్చిన రాసలీలల సీడీలో ఉన్నది నేను కాదని, ఆడియో మాత్రమే తనదని, తన మాటలను వీడియోలో క్లబ్ చేసి వాటిని గ్రాఫిక్స్ లో తన ముఖం కనపడేలా చేశారని సీడీ సుందరి ఆమె సోదరుడు చిన్నీని నమ్మించే ప్రయత్నం చేసినట్లు లీక్ అయిన ఆడియోలో ఉంది.
మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో తాను రాసలీలలు సాగించలేదని, అంత దిగజారే పని తాను చేయనని.. తనను పూర్తిగా నమ్మాలని సీడీ సుందరి ఆమె తల్లి, సోదరుడు చిన్నీని నమ్మించే ప్రయత్నం చేసిందని.. మాజీ మంత్రి డీకే.శివకుమార్ మనుషులు ఇక్కడికి వస్తున్నారని, వారితో మాట్లాడిన తరువాత మళ్లీ ఫోన్ చేస్తానని సీడీ సుందరి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే.. ఆ ఆడియో టేప్‌లో సీడీ సుందరి ప్రియుడు ఆకాష్ పేరు ఉంది. ఆకాష్ తోపాటు కొందరు స్నేహితులు తనకు అండగా నిలిచారని, కుటుంబ సభ్యులు అండగా లేకపోవడం బాధగా ఉందని విలపించింది. సీడీ సుందరి కుటుంబ సభ్యులతో ఆమె లవర్ ఆకాష్ కూడా మాట్లాడటం కాకపుట్టించింది. అయితే.. సీడీ సుందరి మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద రివర్స్ కేసు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది.
ఈ రాసలీలల వ్యవహారం కాస్త బీజేపీ–-కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాగా.. ‘సమస్య వచ్చింది. ఎదుర్కొంటా, భయపడను అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. రేపటి నుంచే నా అస్త్రాలు వదులుతా’ అని రమేష్ జార్కిహొళి సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత తమపై కుట్ర మొదలైందన్నారు.