Google Pixel 9 Series: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ను లాంచ్ చేసింది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మోడల్స్‌ను విడుదల చేసింది. వీటిని టెన్సార్ జీ4 ఎస్‌ఓసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చారు. వాటర్, డస్ట్‌ను తట్టుకునే విధంగా డిజైన్ చేయడంతో పాటు ఏడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తున్నారు. అయితే ఈ ఫోన్ల అమ్మకాలు ఆగస్టు 22 నుంచి ప్రారంభం అవుతాయి. మరి భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పిక్సెల్ 9
ఇచ జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ పిక్సెల్ 9 మోడల్ ఫోన్ ధర రూ.79,999. ఇందులో పీయోని, ఒబ్సిడియాన్, వింటర్‌గ్రీన్, పోర్సెలేన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి డ్యూయల్ సిమ్ ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్‌వేర్‌తో రన్ అయ్యే వీటికి సెక్యూరిటీ ప్యాచ్, పిక్సెల్ డ్రాప్‌లను కూడా ఇవ్వనున్నారు. 6.3 అంగుళాలతో ఉన్న ఈ ఫోన్లు ఆక్చూవా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు 422 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో ఇస్తున్నారు. రిప్రెష్ రేట్ రేజింగ్ 69 హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు ఇచ్చారు. బ్యాక్ డ్యూయల్ కెమెరా అమర్చారు. ఫ్రంట్ కెమెరా 10.5 మెగాపిక్సెల్ ఉంది. 8x వరకు జూమ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ ఆక్టా పీడీవైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 64 మెగా పిక్సెల్ క్వాడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చారు. అలాగే 4కే వీడియోలు తీసుకోవచ్చు. దీని బ్యాటరీ 4700ఎంఏహెచ్ ఉంది. దీనికి ఛార్జర్ వేరేగా కొనుక్కోవాలి. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 45 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ తొందరగా ఎక్కుతుందని, ఒకసారి పెడితే 24 గంటలు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.
పిక్సెల్ 9 ప్రో, పిక్సెల 9 ప్రో ఎక్స్‌ఎల్
పిక్సెల్ 9లో ఉన్నట్లే సిమ, సాఫ్ట్‌వేర్, చిప్‌సెట్ ఫీచర్లే ఇందులో ఉంటాయి. 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ పిక్సెల్ 9 ప్రో ధర రూ.109,999గా, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ధరను రూ.1,24,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు మోడల్స్ హాజెల్, పోర్సెలేన్, రోజ్ క్వార్జ్, ఒబ్సిడియాన్ రంగుల్లో రానున్నాయి. వీటికి 120 హెచ్‌జెడ్ రిప్రెష్ రేటు ఇచ్చారు. రెండు ఫోన్లలో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా అమర్చారు. 30x వరకు జూమ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా 42 ఎంపీ ఇచ్చారు. 8కేతో వీడియో తీయవచ్చు. పిక్సెల్ 9 ప్రోలో 4700 ఎంఏహెచ్, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌లో 5060 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. వీటికి కూడా వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్
బుక్‌లా ఉండే ఫోల్డబుల్ ఫోన్ 6.3 అంగుళాల పొడవుతో 120 హచ్‌జెడ్ రిప్రెష్ రేటు ఉంది. ఫోల్డ్ తీశాక 8 అంగుళాలతో ఫ్లెక్స్ అమోలోడ్ డిస్‌ప్లే కనిపిస్తుంది. మల్టీ అలాయ్ స్టీల్, ఏరోస్పేస్ హైస్ట్రైంత్ అల్యూమినియంతో కూడిన అలాయ్ కవర్‌తో వస్తుంది. వెనుక మూడు కెమెరాలు అమర్చారు. 48 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇవ్వడంతో పాటు, 10.5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, 10.8 ఎంపీ టెలిఫొటో కెమెరా కూడా ఇచ్చారు. దీనిని 5x వరకు జూమ్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ పవర్ 4560 ఎంఏహెచ్. ఒబ్సిడియాన్, పోర్సెలేన్ రంగుల్లో ఉన్న వీటి ధర రూ.1,72,999. గూగుల్ ఏఐ జెమినీతో వస్తున్న ఈ ఫోన్లలో స్టోరీలు, బ్లాగ్స్ రాసుకోవచ్చు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More