https://oktelugu.com/

UPI Payments: గూగుల్ పే, ఫోన్ పే చేస్తున్నారా? నేటి నుంచి మారిన మారిన కొత్త యూపీఐ రూల్స్ ఇవే..

ఎన్నో సంవత్సరాల నుంచి వాడకుండా వదిలేసిన ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యూపీఐ ఐడీలను తొలగిస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 2, 2024 / 02:13 PM IST

    UPI Payments

    Follow us on

    UPI Payments: కుక్క పిల్లా, అగ్టి పుల్లా, సబ్బు బిల్ల, కాదేది కవితకనర్హం.. కానీ ఇప్పుడు కాదేది యూపీఐ పేమెంట్స్ కుకనర్హం అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ చిన్న వస్తువు కొనాలన్నా ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఈ పేమెంట్స్ ప్రారంభమైనప్పటి నుంచి కోట్లలో డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఈ పేమెంట్స్ ను మరింత మెరుగుపరిచేలా ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకోండి..

    వాడకుంటే బంద్.. ఎన్నో సంవత్సరాల నుంచి వాడకుండా వదిలేసిన ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యూపీఐ ఐడీలను తొలగిస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఎందుకంటే వాడకుండా ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరగకుండా ఆపడానికే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ తిరిగి కావాలనుకుంటే తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చని తెలిపారు.

    నాలుగు గంటల లిమిట్.. పెరుగుతున్న ఆన్ లైన్ చెల్లింపు మోసాలను తగ్గించడానికి లిమిట్ కూడా ఉండవచ్చు. ఇంత వరకు లావాదేవీలు చేయని వారు కేవలం మొదటి సారి రూ. 2000 మాత్రమే చేయవచ్చు. ఆ తర్వాత మళ్లీ చేయాలనుకుంటే నాలుగు గంటల కాలపరిమితి ఉంటుందట.

    పెరిగిన లావాదేవీ పరిమితులు.. ఇన్ని రోజులు ఉన్న పరిమితిని పెంచారు. దీంతో ఒకరోజు చెల్లింపు పరిమితి ఏకంగా రూ. లక్షకు పెంచారు. అయితే విద్య, ఆరోగ్య సౌకర్యాల కోసం ఈ చెల్లింపుల పరిమితిని డిసెంబర్ 8న ఆర్ బీఐ రూ. 5లక్షలకు పెంచింది. ఇంతకు ముందు కేవలం లక్ష మాత్రమే ఉండేది.

    యూపీఐ ఏటీఎం.. దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ప్రవేశ పెట్టనుంది ఆర్ బీఐ. మీ బ్యాంక్ ఖాతానుంచి ఈ ఏటీఎంలను ఉపయోగించి నేరుగా నగదు తీసుకోవచ్చు. అందుకోసం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి యూపీఐ యాప్ ల నుంచి ఎవరికి డబ్బు పంపించినా కూడా వారి బ్యాంక్ ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది.