Google Pads: Youtube ద్వారా మ్యూజిక్ అందించే Google Podcasts యాప్ 2024 ఏప్రిల్ 2 నుంచి పనిచేయదు. అమెరికాలోని గూగుల్ పాడ్స్ యాప్ కంపెనీని మూసివేస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి ఈ యాప్ పనిచేయదని తెలపడం ద్వారా దీని సేవలు ఆగిపోనున్నాయి. ఈరోజు నుంచి దీని వినియోదారులకు యాప్ ద్వారా ఎటువంటి మ్యూజిక్ వినలేరని పేర్కొంది. దీంతో ఈ యాప్ కు ఇప్పటి వరకు ఉన్న సబ్ స్క్రైబర్లు దూరం అవుతున్నారు.
ప్రపంచవ వ్యాప్తంగా గూగుల్ పాడ్స్ కు 500 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. దాదాపు ఐదేళ్లకు పైగా దీనిని వినియోగిస్తున్నారు. RSSఫీడ్ ద్వారా పాడ్ కాస్ట్ లను అందిస్తూ అభిమానులను అలరించింది. అయితే యూట్యూబ్ తన ఆడియో సేవలను విస్తరించడానికి గూగుల్ పాడ్స్ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు 2023 సెప్టెంబర్ లోనే తెలిపింది. 2020లో యూట్యూబ్ మ్యూజిక్ మూసివేసే సమయంలో గూగుల్ ప్లే మ్యూజిక్ దూరం కానుందని తెలిపింది. కానీ మూడేళ్ల పాటు దీనిని వాడుకునేందుకు అవకాశం ఇచ్చింది. 2023 ఏడాది చివరి నాటికి గూగుల్ పాడ్స్ యూజ్ చేసుకోవచ్చని తెలిపింది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా 2024 ఫిబ్రవరి చివరి నాటికి చాలా మంది గూగుల్ పాడ్స్ లో మ్యూజిక్స్ ను అప్లోడ్ చేశారు. యూట్యూబ్ యూజర్స్ దీనిని ఎక్కువగా వాడుతున్నందు వల్ల వారి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని కల్పించింది. 2024 మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా 11 మార్కెట్లో వీడియో ఫాడ్ కాస్ట్ లను పరీక్షించిన తరువాత దాని స్ట్రీమింగ్ యాప్ ను యూఎస్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. ఈ నేపత్యంలో యూనివర్సల్ మ్యూజిక్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాంగా Bleeping Copmputers అనే వ్యక్తి మొదటిసారిగా గూగుల్ పాడ్ కాస్ట్ లను మూసివేస్టున్నట్లు తన వెబ్ సైట్ ద్వారా తెలియజేశాడు. దీనిని 2024 మార్చి చివరి వరకు మాత్రమే వినియోగిస్తారని తెలిపారు. అయితే ఇందులోని సబ్ స్క్రైబర్లు తమ పాప్ ఆప్ లు సేవ్ చేసుకోవడానికి జూలై వరకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.