Kawasaki Z1000: రోడ్డుమీద వెళ్తున్నప్పుడు స్టైల్ గా కనిపించాలని యూత్ కోరుకుంటారు. ఇలాంటివారు బైక్ ధరతో సంబంధం లేకుండా ఆకర్షణీయంగా ఉండే వాటి వైపు చూస్తారు. వీరి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంటాయి. ఇలా ఆకట్టుకునే డిజైన్స్ బైక్స్ తీసుకురావడంలో Kawasaki ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది. దీని నుంచి ఇప్పటికే స్టైలిష్ బైక్స్ చాలా వరకు వచ్చి యూత్ ను ఇంప్రెస్ చేశాయి. అయినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీని పరిచయం చేస్తూ బైక్ డిజైన్స్ ను మారుస్తుంది. అయితే ఈ కంపెనీ నుంచి కొత్తగా వచ్చే బైక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
kawasaki నుంచి 2026 సందర్భంగా Z1000 అనే పేరుతో కొత్త బైక్ రాబోతుంది. ఇది చూడగానే టెంప్ట్ చేసే విధంగా డిజైన్ కలిగి ఉంది. ఏ వైపు నుంచి చూసినా కూడా ముచ్చటేస్తుంది. పూర్తిగా బోల్డ్ లుక్ లో కనిపిస్తూ యువకులను ఆకట్టుకునే విధంగా ఉంది. దీనికి అమర్చిన LED హెడ్ లాంప్స్ బైకుకు అందాన్ని తీసుకువచ్చాయి. అలాగే పెట్రోల్ ట్యాంక్ బండి వెడల్పుగా ఉండడంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏ బైక్ కు రాని గ్రీన్ కలర్ ఈ బైక్ కనిపించడం ప్రత్యేకతను చాటుకుందని తెలుస్తోంది. అలాగే దీనిపై గ్రాఫిక్స్ తో డిజైన్ చేసిన బాడీ ఉండడంతో దీన్ని చూడగానే వెంటనే కొనుగోలు చేస్తారు. పూర్తిగా సుగోమి శైలిలో ఉండే ఈ బైక్ ఫ్రేమ్ స్ట్రీట్ ఫైటర్ను తలపిస్తుంది.
kawasaki Z1000 లో ఉండే ఇంజన్ ఫోర్ స్ట్రోక్. ఇందులో 1043 CC ఇంజన్ ను అమర్చారు. ఇది ఫాస్ట్ థ్రోటిల్ రెస్పాన్స్ ను కలిగి ఉంటుంది. ఇంజన్ మొత్తం ECU తో అప్డేట్ చేయబడింది. దీనిపై హైవేలో ప్రయాణిస్తే ఎలాంటి అలజడి లేకుండా తుఫానులా వెళ్ళవచ్చు. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ తో ఉండడంవల్ల గేర్ బాక్స్కు అనుగుణంగా ఉంటుంది. వేగవంతమైన ప్రయాణం కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు. బ్లూటూత్ రైడర్ల కోసం నావిగేషన్ డేటా మొత్తం ఫోన్ తో కనెక్ట్ చేయబడి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ను అందిస్తుంది. వివిధ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రైడ్ మోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ABS బైకును స్థిరంగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది.
ఈ బైక్ ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా అల్యూమినియం ట్విన్ ట్యూబ్ ప్రేమ్ ను కలిగి ఉంది. నగరాల్లో ప్రయాణించేటప్పుడు కూడా పూల మలుపులు తిరిగే సమయంలో హ్యాండిల్ పవర్ తో పనిచేస్తుంది. ముందు, వెనుక భాగంలో సస్పెన్షన్ ఉండడంవల్ల రైటర్లు బైక్ను సౌకర్యవంతంగా రెడీ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు బ్రేంబో బ్రేక్స్, బలమైన స్టాపింగ్ పవర్ను అందిస్తాయి. దీనిని రూ.12.79 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది.