Anaganaga Oka Raju Box Office Collection: ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటి ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ అదిరిపోయాయి . పండగ సెలవులు ముగిసేవరకు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడేసింది. ఆ తర్వాత బాగా చల్లబడినప్పటికీ, బయ్యర్స్ కి నిర్మాతకు రావాల్సిన డబ్బులు మొదటి నాలుగు రోజుల్లోనే వచ్చేసాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 19 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయట. 16 వ రోజున ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ నుండి పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా 16 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ ప్రాంతం నుండి 4 కోట్లు,ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 7 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా నుండి 4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2.15 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 2.50 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 2 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 1.38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 59 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ నుండి 8.65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా 16 రోజుల్లో ఈ చిత్రానికి 46.65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 84 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ చిత్ర నిర్మాత నాగావమీ ఈ సినిమా మొదటి వారం లోనే వంద కోట్ల గ్రాస్ వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. కానీ లాంగ్ రన్ లో కూడా అంత మొత్తం గ్రాస్ ని రాబట్టలేదు. కనీసం 50 కోట్ల షేర్ మార్కుని అందుకొని ఉన్నా బాగుండేది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్క ప్రకారం ఈ చిత్రానికి కేవలం మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు . అంటే టార్గెట్ గా బాగా దగ్గరగా వచ్చి ఆగిపోయింది అన్నమాట.