Car Offers: ఇయర్ ఎండింగ్.. కార్ల కంపెనీల భారీ ఆఫర్స్.. త్వరపడండి..

దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల విక్రయాల్లో ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన మోడళ్లను అందుబాటులోకి తెచ్చి వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : December 10, 2023 2:43 pm

Car Offers

Follow us on

Car Offers: 2023 సంవత్సరం మొత్తానికి ముగింపు దశకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో 2024 ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పొడవున జరిగిన సంగతులు చాలా మంది నెమరేసుకుంటున్నారు. కొత్త ఏడాదిలో ఏం చేయబోతున్నారో ప్లాన్లు వేస్తున్నారు. అయితే 2023 ఇయర్ ఎండింగ్ సందర్భంగా కొన్ని కార్ల కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు. కొన్ని మోడళ్లను తక్కువ ధరకు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వీటిలో మారుతి సుజుకీ, హ్యుందాయ్ ముందున్నాయి. వీటితో పాటు కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా డిస్కౌంట్లు ప్రకటించాయి. మరి తక్కువ ధరకు వచ్చే కార్లు ఏవో తెలుసుకుందాం..

దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల విక్రయాల్లో ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన మోడళ్లను అందుబాటులోకి తెచ్చి వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే తాజాగా కొన్ని కార్లను భారీ తగ్గింపుతో ఇస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఎస్ యూవీపై రూ.25 వేల డిస్కౌంట్ ను ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే బాలెనోపై రూ.30,000 , గ్రాండ్ విటారాపై రూ.15,000, ఇగ్నిస్ పై రూ.40 వేల ఎక్చ్సేంజ్ ఆఫర్లను ప్రకటించింది.

మరో కంపెనీ హ్యుందాయ్ సైతం కొన్ని రాయితీలను ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఐ 10 పై రూ.45,000 తగ్గింపుతో విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఇందులో రూ.35,000 క్యాష్ బ్యాక్, రూ.10,000 ఎక్చ్సేంజ్ బోనస్ ను అందిస్తోంది. అలాగే ఐ 20, ఐ 20 ఎన్ లైన్ పై రూ. 50,000 వరకు , టాక్సన్ ఎస్ యూవీపై రూ.1.5 లక్షల డిస్కౌంట్ ను అందిస్తుంది. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాపై కూడా రాయితీలను అందిస్తున్నారు. మహీంద్రా ఎక్స్ యూవీ 400 వాహనంపై రూ.4.2 లక్షల భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.

2024లో కార్ల రేట్లు పెరుగుతున్నందున ఈ ఏడాది ముగింపు దశలో వీటిని భారీ తగ్గింపుతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని కంపెనీలు సైత భారీ ఆఫర్లను ప్రకటించేందుకు రెడీగా ఉన్నాయి. కేవలం కార్ల కంపెనీలు మాత్రమే కాకుండా కొన్ని బ్యాంకుల ద్వారా రుణం ద్వారా కారు కొనుగోలు చేసేవారికి డిస్కౌంట్లు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కారు కొనాలనుకునేవారికి ఇది మంచి సమయం అని కొందరు చెబుతున్నారు.