Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేవాళ్లకు శుభవార్త.. తక్కువ వడ్డీతో నిమిషాల్లో రుణం!

Gold Loan:  మనలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పర్సనల్ లోన్ ను పొందాలన్నా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో బంగారం తీసుకెళ్లి బ్యాంక్ లేదా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలలో తనఖా పెట్టడం ద్వారా సులభంగా రుణం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ ను అందించే దిశగా అడుగులు వేస్తోంది. నెలకు వడ్డీ 0.54 శాతం నుంచి ప్రారంభం కానుండగా నాన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 6, 2022 11:56 am
Follow us on

Gold Loan:  మనలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పర్సనల్ లోన్ ను పొందాలన్నా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో బంగారం తీసుకెళ్లి బ్యాంక్ లేదా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలలో తనఖా పెట్టడం ద్వారా సులభంగా రుణం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ ను అందించే దిశగా అడుగులు వేస్తోంది.

నెలకు వడ్డీ 0.54 శాతం నుంచి ప్రారంభం కానుండగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో అతి తక్కువ వడ్డీరేటు ఇదేనని చెప్పవచ్చు. దేశంలోని 2,200 బ్రాంచ్ లలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. గోల్డ్ లోన్ సెక్యూర్డ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కాగా బంగారాన్ని తనఖా పెట్టి సులభంగా రుణం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మార్కెట్ లో కేవలం బంగారాన్ని ప్రాతిపదికగా తీసుకొని రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది.

మెటల్స్, స్టోన్స్, జెమ్స్‌ లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఐఐఎఫ్‌ఎల్ 24 నెలల వరకు లోన్ టెన్యూర్ అందిస్తుండగా గోల్డ్ లోన్ ను తీసుకున్న వాళ్లు 24 నెలల్లోగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలల చొప్పున తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించే అవకాశం అయితే ఉంటుంది.

ఈ సంస్థ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా కేవం 30 నిమిషాలలో గోల్డ్ లోన్ ను పొందవచ్చు. ఈ సంస్థలో తీసుకునే లోన్ కు వడ్డీ చెలింపునకు ఐదు రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. బంగారం రేటు అంతకంతకూ పెరుగుతుండటంతో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్లకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.