https://oktelugu.com/

Star Kisan Ghar: రైతులకు అదిరిపోయే శుభవార్త.. రూ.50 లక్షల ఇంటి రుణం పొందే ఛాన్స్?

Star Kisan Ghar: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ బ్యాంక్ రైతులకు తీపి కబురు అందించింది. స్టార్ కిసాన్ ఘర్ పేరుతో కేంద్రం రైతులకు అదిరిపోయే రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఇల్లు కట్టుకోవడంతో పాటు ఇంటికి సంబంధించిన మరమ్మత్తులను సులభంగా చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న రైతులు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2022 / 07:23 PM IST
    Follow us on

    Star Kisan Ghar: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ బ్యాంక్ రైతులకు తీపి కబురు అందించింది. స్టార్ కిసాన్ ఘర్ పేరుతో కేంద్రం రైతులకు అదిరిపోయే రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఇల్లు కట్టుకోవడంతో పాటు ఇంటికి సంబంధించిన మరమ్మత్తులను సులభంగా చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

    బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న రైతులు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కేవలం ఈ బ్యాంకు ఖాతాదారులైన రైతులు మాత్రమే స్టార్ కిసాన్ ఘర్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కీమ్ ద్వారా కనీసం లక్ష రూపాయల నుంచి గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ నిర్మించడం లేదా ఇప్పటికే ఉన్న ఫామ్ హౌస్ కు మరమ్మత్తులు చేయించడానికి ఈ స్కీమ్ ఉపయోగకరంగా ఉంటుంది.

    ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణానికి వడ్డీరేటు 8.05 శాతంగా ఉంది. రైతులు తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా 15 సంవత్సరాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి మరమ్మత్తుల కోసం లోన్ తీసుకునే వాళ్లకు లక్ష రూపాయల నుంచి గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు లోన్ లభిస్తుంది. ఐటీ రిటర్న్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఈ లోన్ ను పొందే అవకాశం ఉండటం గమనార్హం.

    1800 103 1906 నంబర్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించి ఈ స్కీమ్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. https://www.bankofindia.co.in/star_kisan_ghar వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.