Sbi Atm Card: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లకు డెబిట్ కార్డులపై ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తోంది. ఎస్బీఐ డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఎస్బీఐ కార్డ్ హోల్డర్ విమాన ప్రమాదంలో చనిపోతే నామినీ 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ యూజర్లు కార్డుపై ప్రొటెక్షన్ కవర్‌ను కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. కార్డును తీసుకున్న మూడు నెలల లోపు కార్డు దొంగతనానికి గురైతే ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎస్‌బీఐ రూపే జన్ ధన్ కార్డు ఉన్నవాళ్లకు 2 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏటీఎంలలో, పీఓఎస్ టర్మినల్స్‌లో, ఈకామర్స్ వెబ్‌సైట్‌లో లావాదేవీలు జరపడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఇతర బ్యాంకులు కూడా కస్టమర్లకు ఈ తరహా బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.