పర్యావరణ కాలుష్యంతో పాటు, చమురు ధరలు విపరీతంగా ఉండడం వల్ల పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సైతం ప్రోత్సాహం అందిస్తోంది. అయితే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మండి నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఒకేసారి పెట్రోల్, డీజిల్ వాహనాల ఉత్పత్తి నిలిచిపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆటోమోబైల్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. కంపెనీల మధ్య పోటీ ఏర్పడడంతో వీటి ధర కూడా తగ్గుతోంది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే డీజిల్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా పెట్రోల్ వాహనాలపై ఇదే నిర్ణయం తీసుకోబోతున్నట్లు నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అర్థమవుతోంది. దీంతో ఆటోమోబైల్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
చమురు వాహనాల స్థానంలో ఈవీలను ప్రవేశపెట్టడం మంచిదే.. గానీ ఒకేసారి ఉత్పత్తి నిలిపి వేయడంతో నష్టాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈవీల వాహనాల ఉత్పత్తికి అనువైన సౌకర్యాలు లేవని, ప్రస్తుతం పెట్రో, డీజిల్ వాహనాలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే పెట్రోల్ వాహనాల ఉత్పత్తిని ఎప్పుడు నిలిపివేస్తారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఆటోమోబైల్ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.
మరోవైపు ఈవీలు అందుబాటులోకి వస్తే వినియోగదారులకు అనేక లాభాలు ఉండనున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ కు రూ.100 వెచ్చిస్తే అప్పుడు కొన్ని కిలోమటర్లకు రూ.4 మాత్రమే ఖర్చవుతుందని అంటున్నారు. మరోవైపు ప్రపంచం మొత్తం ఈవీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. మిగతా దేశాలకు అనుగుణంగా ఉండడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఈవీలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్న చర్చ సాగుతోంది.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More