https://oktelugu.com/

Gold Silver Prices : బంగారం కొనాలనుకునేవారికి ఊరట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.80,500గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2023 / 09:12 AM IST
    Follow us on

    Gold Silver Prices : బంగారం ధరలు సోమవారం స్థిరంగా కొనసాగాయి. రెండు రోజుల పాటు వరుసగా పెరిగిన ధరలు స్థిరంగా కొనసాగడం ఊరట కలిగింది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగాయి.

    బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 4న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,760 గా ఉంది. డిసెంబర్ 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,450తో విక్రయించారు. ఆదివారం కంటే సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,910గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,450 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,760 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.59,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,530తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,450 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,760తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,450తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,760తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.80,500గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.80,500గా ఉంది. ముంబైలో రూ.80,500, చెన్నైలో రూ.83,500, బెంగుళూరులో 79,000, హైదరాబాద్ లో రూ.83,500తో విక్రయిస్తున్నారు.