Gold Price Today: బంగారం ధరలు వారం రోజుల తరువాత ఊరటనిచ్చాయి. సోమవారం కంటే మంగళవారం ధరలు స్థిరంగా కొనసాగాయి. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం ఎలాంటి శుభకార్యాలు లేకున్నా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడంతో కొందరు వినియోగదారులు పర్చేజ్ చేసేందుక ఆసక్తి చూపుతున్నారు. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 26న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.66,810 గా ఉంది. మార్చి25న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,240తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారంతో పోలిస్తే మంగళవారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,390 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.67,460గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,240 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.66,810 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,840 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.67,450తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,240 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,810తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.61,240తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,810తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్థిరంగా ఉన్న వెండి ధరలు మాత్రం పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,900గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.500 పెరిగింది . న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,900గా ఉంది. ముంబైలో రూ..77,900, చెన్నైలో రూ.80,900, బెంగుళూరులో 76,350, హైదరాబాద్ లో రూ.80,900తో విక్రయిస్తున్నారు.