Gold Price Today: వెండి ధరలు లక్ష రూపాయలు దాటి మళ్లి వెనక్కి తగ్గాయి. బుధవారం ఒక్కరోజే రూ.2,100 దిగింది. బంగారం సైత భారీస్థాయిలోనే తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే22న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,290గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.74,500 గా ఉంది. మే 21న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,910తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.620 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,440 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.74,650గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,290 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.74,500 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,590 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,830తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,290 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,500తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,290తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,500తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.94,500గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.2100 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.94,500గా ఉంది. ముంబైలో రూ.94,500, చెన్నైలో రూ.98,900 బెంగుళూరులో 92,400, హైదరాబాద్ లో రూ. 98,900 తో విక్రయిస్తున్నారు.