Gold Price Today: బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది శుభవార్తే. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 18న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,320 గా ఉంది. జూన్ 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.200 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,470గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,300 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,320 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,970తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,3000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,320తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,300తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,320తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.90,900గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.90,900గా ఉంది. ముంబైలో రూ.90,900, చెన్నైలో రూ.95,500 బెంగుళూరులో 91,200, హైదరాబాద్ లో రూ. 95,500 తో విక్రయిస్తున్నారు.