Homeబిజినెస్Gold Rates Today: బంగారం, వెండి తగ్గేదేలే.. మరోసారి భారీ షాక్..

Gold Rates Today: బంగారం, వెండి తగ్గేదేలే.. మరోసారి భారీ షాక్..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 8న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,360గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,390 గా ఉంది. మే 7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,060తో విక్రయించారు.

Gold Price Today: బంగారం ధరలు మరోసారి భారీ షాక్ ఇచ్చాయి.  నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగాయి. వెండి మాత్రం భారీ స్థాయిలో ఎగబాకింది. ఈరోజు ఏకంగా రూ.1000 పెరిగింది.  రెండు రోజుల్లో వెండి రూ.3000  హైక్ కావడం ఆందోళన కలిగిస్తోంది.. కొన్ని రోజుల పాటు ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ వరుసగా పెరుగుతుండడంతో కొనుగోలుదారులు షాక్ తింటున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 8న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,360గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,390 గా ఉంది. మే 7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,060తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.300 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,510 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,440 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,360 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,390 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,410 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,440తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,360 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,390తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,360తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,390తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగానే పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.85,000గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.1000 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.85,100గా ఉంది. ముంబైలో రూ.85,100, చెన్నైలో రూ.88,600, బెంగుళూరులో 84,100, హైదరాబాద్ లో రూ.88,600తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper