Gold Price Today: నిన్న పండుగ వేళ బంగారం ధరలు తగ్గి శుభవార్త చెప్పాయి. కానీ ఈరోజు ధరలు చుక్కలు చూపించాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ఒక్కరోజే రూ.1400 పెరిగింది. అటు వెండి సైతం తగ్గేదేలే అన్నట్లుగా భారీ స్థాయిలో ధరలు ఎగబాగాయి. వెండి ఒక్కరోజే రూ.2500 పెరిగి భారీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2360 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 28.19 డాలర్ల వద్ద నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే11న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,550గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,690 గా ఉంది. మే 10న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,150తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.1400 తగ్గింది . దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,710 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,850 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,560 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,700 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,710 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,860తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,560 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,700తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,560తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,700తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు భారీగా స్థాయిలో పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.87,700గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.2500 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.87,800గా ఉంది. ముంబైలో రూ.87,800, చెన్నైలో రూ.91,300, బెంగుళూరులో 87,100, హైదరాబాద్ లో రూ.91,300తో విక్రయిస్తున్నారు.