
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులని కబళిస్తుంది. కరోనాతో కనీసం రోజుకు ఇద్దరు ప్రముఖులైన కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయి కవి అదృష్టదీపక్(70) కరోనాతో కన్నుమూశారు. ఏటికెదురు నిలిచాయి (యువతరం కదిలింది) నేడే మేడే( ఎర్రమల్లెలు) మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం ( నేటి భారతం) వంటి పలు సూపర్ హిట్ గీతాలను ఆయన రచించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అధ్యాపడుకుడిగా పదవీ విరమణ చేసిన దీపక్ రామచంద్రాపురంలో నివసిస్తుండగా కరోనా బారిన పడ్డారు.