https://oktelugu.com/

Gold Prices: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. టెన్షన్ లో కొనుగోలుదారులు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 20న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. జనవరి 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400తో విక్రయించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 20, 2024 / 08:32 AM IST

    Gold Prices Today

    Follow us on

    Gold Prices: కొన్ని రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారి భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళనతో ఉన్నారు. అటు వెండి ధరలు సైతం పెరగడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 20న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. జనవరి 19న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400తో విక్రయించారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు రూ.300 పెరిగాయు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,100గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,380తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు.

    బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,700గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి రూ.200 మేర పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,700గా ఉంది. ముంబైలో రూ.75,700, చెన్నైలో రూ.77,200, బెంగుళూరులో 73,000, హైదరాబాద్ లో రూ.77,200తో విక్రయిస్తున్నారు.