Homeబిజినెస్Gold Price Drop Today: గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు వెంటనే త్వరపడండి

Gold Price Drop Today: గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు వెంటనే త్వరపడండి

Gold Price Drop Today: ప్రస్తుతం చాలా మందిని ఈ బంగారం, వెండి ధరలు డైలమాలో పడేస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం సరిగ్గా లభించడం లేదు కదా. అయితే ఈ రోజు బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ లో యుద్ధం నడుస్తున్న సందర్భంగా, US డాలర్ అస్థిరత వంటి ఇటీవలి ప్రపంచ, భౌగోళిక రాజకీయ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో హెచ్చుతగ్గుల ప్రభావం ఉంది. అక్కడ మాత్రమే కాదు మన దేశీయ మార్కెట్‌లో కూడా ఈ ఛేంజ్ కనిపిస్తోంది. అయితే ఈ రోజు అంటే జూన్ 24న మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 680 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం గురించి చెప్పాలంటే కేవలం 92, 290 రూపాయలుగా ఉంది.

అటు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జరుగుతున్న సందర్భంగా ఇంకా కూడా బంగారం ధర పెద్దగా పెరగలేదు అనే చెప్పవచ్చు. ఇరాన్ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే అటు సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.27% తగ్గింది. ఇక భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం మధ్యాహ్నం బంగారం ధరలు దాదాపు స్థిరంగా నే ఉండి సామాన్య ప్రజలకు కాస్త ఊరటను ఇచ్చాయి . మొదట్లో జస్ట్ 0.06% స్వల్ప క్షీణతతో కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒత్తిడి ఉంది. రూపాయి బలహీనత భారతదేశంలో బంగారం ధరలకు మద్దతు ఇస్తుందని అంటున్నారు నిపుణులు. ఇక ఈ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ కనిపిస్తుంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలు కలిపి ధరలు మరింత పెరుగుతాయి.

Also Read:  Gold With Indians: భారతీయుల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.
ఢిల్లీలో ఉండే వారు బంగారం కొనాలంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.83 లక్షలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర విషయానికి వస్తే 92,440 రూపాయలుగా కొనసాగుతుంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1. 68 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 92,290.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1. 68 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర గమనిస్తే రూ. 92,290 ఉంది.
వెండికూడా కాస్త తగ్గింది. ఇప్పుడు కిలో వెండి ధర లక్షా 990 రూపాయలు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular