Gold Silver Price: కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరిగాయి. దీంతో బంగారం కొనాలని అనుకునే వారికి షాక్ తగిలినట్లు అయింది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మాత్రం లాభాల పంట పండుతోంది. అయితే బంగారం ధరలు రోజుకో రకంగా పెరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో కారణంతో పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా బంగారం ధర పెరుగుదలకు యూఎస్ ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయమే కారణమని అంటున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర ఎంత పెరిగింది? హైదరాబాదులో బంగారం ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
బంగారం ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.1,910 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,660 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పెరగడంతో రూ.1,21,600 గా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు పెరగడానికి అమెరికా ఫెడరల్ తీసుకున్నా నిర్ణయమే అని తెలుస్తోంది. ఈ బ్యాంకు వడ్డీరేట్లు మరోసారి తగ్గించడంతో చాలామంది ఇన్వెస్టర్లు బంగారం వైపుకు తిరిగారు. దీంతో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 4,270 డాలర్లకు చేరింది. ఇది గురువారం 4,200 గా ఉంది. ఒక రోజులోని రాత్రికి రాత్రే 70 డాలర్లకు పైగా పెరగడం విశేషం. అమెరికాలో తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. భారత్లోనూ ఈ ప్రభావం చూపింది.
ప్రస్తుతం హైదరాబాదులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,30,750 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,19,850 గా నమోదయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారం కొనాలంటే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి శుభకార్యాలు లేనప్పటికీ.. భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు బంగారం కొనాలని చూశారు. కానీ ప్రస్తుతం ధర మళ్ళీ పెరగడంతో కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.
బంగారంతో పాటు వెండి కూడా విపరీతంగా పెరిగింది. శుక్రవారం ఒకరోజు కిలో వెండి రూ.6,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ.2,15,000 గా కొనసాగుతోంది. బంగారం కంటే వెండి పై ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది భావిస్తూ ఉండడంతో వెండి ధర కూడా పెరుగుతోంది. అంతేకాకుండా వెండి నీ కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్, తదితర రంగాల్లో ఉపయోగించడంతో వెండి ధర అమాంతం పెరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా? మళ్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయా? అనేది చూడాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాలు ప్రారంభం అయితే బంగారం ధరలు కొనుగోళ్లతో మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.