Gold Silver Price : పసిడి కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయం అని తెలుస్తోంది. ఎందుకంటే గత మూడురోజులగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ఆదివారం తో పోలిస్తే సోమవారం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ కావొచ్చని అంటున్నారు. మరికొందరు మాత్రం తగ్గే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అక్టోబర్ 2 సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.53,350గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములను రూ.58,200తో విక్రయిస్తున్నారు. రెండు కేటగిరీల్లోనే ఆదివారం తో పోలిస్తే సోమవారం ధరలు అలాగే ఉన్నాయి. వెండి కూడా ధరలు కూడా స్థిరంగానే ఉండడం విశేషం. సోమవారం దేశ వ్యాప్తంగా కిలో వెండి రూ.73,500తో విక్రయిస్తున్నారు. ఆదివారం కూడా ఇదే ధరతో విక్రయించారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,350తో విక్రయిస్తున్నారు. ఈ నగరంలో వెండిని రూ.73,500తో అమ్ముతున్నారు. ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం 22 క్యారెట్లది 10 గ్రాములకు రూ.53,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.58,200 పలుకుతోంది. ఇక్కడ వెండి రూ.73.500తో విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53, 350తో విక్రయిస్తున్నారు. ఇక్కడ కిలో వెండిని రూ.76,000గా నమోదైంది. విశాఖపట్నంలోనూ ఇదే ధర పలుకుతోంది. చెన్నైలో మిగతా నగరాలతో పోల్చుకుంటే కాస్త ధర ఎక్కువగానే ఉంది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,470తో విక్రయిస్తున్నారు. వెండి విషయానికొస్తే ఇక్కడ కిలోకు రూ.76,000తో అమ్ముతున్నారు.