Gold Prices: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటున్నాయి. వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం స్థిరంగా కొనసాగాయి. అయితే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 11న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. జనవరి 10న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,100గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,940తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు పెరిగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,600గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరు రూ.200 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,600గా ఉంది. ముంబైలో రూ.76,600, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.