Rashi Phalalu: అమావాస్య.. ఈ రాశి వారికి అనుకూలం.. వీరికి మాత్రం..

ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు రావొచ్చు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

Written By: Chai Muchhata, Updated On : January 11, 2024 8:43 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 11న గురువారం ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే మకర సంక్రాంతి నేపథ్యంలో గురువారం మార్గశిర అమవాస్య ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది. మరి కొందరికి ప్రతికూల వాతావరణం ఉండనుంది. ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు రావొచ్చు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృషభం:
ఇప్పటికే మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అమావాస్య సందర్భంగా కొందరికి ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన బకాయిలన్నీ వసూలవుతాయి.

మిథునం:
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు.ఆదాయం పెరిగినా ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం:
ఆదాయం బాగుంటుంది. ప్రియమైన వారికి బహుమతులు అందిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఆఫర్లు వస్తాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

సింహ:
ఈ రాశివారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆలోచనలు ఇబ్బంది పెడుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.

కన్య:
ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే ముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి.

తుల:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కుటుంబంలో విభేదాలు రావొచ్చు.

వృశ్చికం:
పెండింగు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజంతా ఉల్లాసంగా ఉంటారు. కటుుంబ సభ్యులపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు:
కొన్ని శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ వేస్తారు. సోదరులతో సంబంధాలు మెరుగుపడుతాయి. ఆదాయం బాగుంటుంది. కానీ ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

మకర:
ముఖ్యమైన పనుల్లో ఇతరుల సాయం అందుతుంది. ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తారు. తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్పుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

కుంభం:
కొన్ని పనుల కోసం డబ్బు బాగానే ఖర్చవుతుంది. ఆస్తి కొనుగోలు విషయంలో చర్చలు జరుగుతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:
ఈరోజు కొన్ని సమస్యలతో ఆందోళనగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడంతో కొత్త ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడుపుతారు.