Gold And Silver Prices: బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతున్నాయి. బుధవారం ఏకంగా రూ.750కు పైగా దిగినట్లు తెలుస్తోంది. గత ఆదివారం ధరలు స్థిరంగా ఉండి సోమవారం స్పల్పంగా తగ్గాయి. మంగళవారం, బుధవారం భారీగా పతనమయ్యాయి. వెండి ధరలు అంతకంటే ఎక్కువగా డౌన్ ఫాల్ కనిపిస్తోంది. బుధవారం ఏకంగా రూ.2000 తగ్గింది. అక్టోబర్ 4న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం అక్టోబర్ 4న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములను రూ.57,380 కి దిగింది. అక్టోబర్ 3న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.53,350తో విక్రయించారు. బుధవారం ఏకంగా రూ.52,600 కి దిగింది. అంటే రూ.750 తగ్గింది. ఈ ఏడాదిలో ఒక్కరోజులో ఇంత భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. అయితే ఈ ధరలు ఇంకా తగ్గుతాయా? లేదా? అనేదానిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.57,530తో విక్రయిస్తున్నారు. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.57,380 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,710తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,380తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,380తో విక్రయిస్తున్నారు.
వెండి ధరలు కూడా అదే స్థాయిలో పతనం అవుతున్నాయి. దాదాపు రూ.2000 మేర తగ్గి ప్రస్తుతం కిలో వెండి రూ.73,500తో విక్రయిస్తున్నారు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.71,000తో విక్రయిస్తున్నారు. చెన్నైలో రూ.73,500, బెంగుళూరులో 69,00, హైదరాబాద్ లో రూ.73,500తో విక్రయిస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతోనే వీటి ధరలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.