Gautham Adani
Gautham Adani: మహా కుంభమేళాలో అదానీ గ్రూప్ చైర్మన్, భారతీయ బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఏ టైంలో కుంభమేళాలో పాల్గొన్నారో అప్పటి నుంచి తనకు అంతా మంచే జరుగుతుంది.ఎంతలా అంతే తను పట్టిందల్లా బంగారం అవుతుంది. గురువారం అతని కంపెనీలలో ఒకదాని అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కంపెనీ లాభం 80 శాతం పెరిగింది. గౌతమ్ అదానీ కొన్ని రోజుల క్రితం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. అతి త్వరలో తన చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం జరుగబోతుంది.
2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ నికర లాభం దాదాపు 80 శాతం పెరిగి రూ.625.30 కోట్లకు చేరుకుంది. 2023 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.348.25 కోట్లుగా ఉంది. ఈ కాలంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మొత్తం ఆదాయం రూ.6,000.39 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.4,824.42 కోట్లు. ఈ కాలంలో కొత్త కాంట్రాక్టులు పొందడం వల్లే తమ ఆదాయాలు, లాభాలు పెరిగాయని కంపెనీ తెలిపింది.
Gautham Adani (1)
ఈ ప్రాజెక్టు ఒప్పందాలు కంపెనీకి తన మార్కెట్ వాటాను పెంచుకునే అవకాశాన్ని ఇచ్చాయి. దేశంలోనే అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ కంపెనీగా ఎదగడం ఆ కంపెనీ దృష్టి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ను గతంలో అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ అని పిలిచేవారు. గౌతమ్ అదానీ గత మంగళవారం తన మొత్తం కుటుంబంతో కలిసి మహా కుంభమేళాకు చేరుకున్నారు. వీరిలో ఆయన భార్య ప్రీతి అదానీ, పెద్ద కుమారుడు కరణ్ అదానీ, కోడలు పరిధి అదానీ, మనవరాలు కావేరి, చిన్న కుమారుడు జీత్ అదానీ ఉన్నారు. మహా కుంభమేళా సందర్భంగా ప్రతిరోజూ లక్ష మందికి ఉచితంగా ఆహారం అందించాలని, కోటి మతపరమైన పుస్తకాలను పంపిణీ చేస్తామని అదానీ కుటుంబం ప్రతిజ్ఞ చేసింది. గౌతమ్ అదానీ మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నప్పుడు, ఆయన స్వయంగా పూరీలు వేయించి, తన భార్యతో కలిసి భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. అతని భార్య, కోడలు ప్రసాదం తయారీలో పాల్గొన్నారు.
అతని కుమారుడు కరణ్, కోడలు పరిధి కుంభమేళాలో సాధువుల నుండి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు కనిపించారు. చిన్న కుమారుడు జీత్ అదానీ కూడా పూజలు నిర్వహించాడు. ఇక్కడే గౌతమ్ అదానీ తన చిన్న కుమారుడు జీత్ వివాహం ఫిబ్రవరి 7న దివా షాతో సరళమైన వేడుకలో జరుగుతుందని తెలియజేశారు.ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. అనంత్ అంబానీ పెళ్లి కంటే గ్రాండ్ గా ఈ పెళ్లిని అదానీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Gautham adani at kumbh mela with family photos viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com